ల్యాండింగ్‌ సమయంలో సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం..ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు..

|

Nov 25, 2023 | 8:21 PM

విమానం సముద్రంలో వాలగానే.. ప్రయాణికులు విమానం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని విమానానికి నాలుగు వైపులా ఎమర్జెన్సీ రెస్క్యూ బూత్‌లను ఏర్పాటు చేశారు విమాన సిబ్బంది. మరోవైపు ప్రయాణికుల ప్రాణాలు కాపాడామని మెరైన్ అధికారులకు కూడా సమాచారం అందించారు. ఈ విమానం US నౌకాదళం తరపున సముద్ర సరిహద్దులో పెట్రోలింగ్ కోసం మోహరించింది. నేవీకి సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం,

ల్యాండింగ్‌ సమయంలో సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం..ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు..
Navy Surveillance Plane
Follow us on

ఆక్సిడెంట్‌..అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేం. దానికి సంబంధించిన సూచనలు, సంకేతాలు తెలుస్తాయి. కానీ, ఖచ్చితంగా ఆక్సిడెంట్‌ ఎప్పుడు జరుగుతుందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇది అకస్మాత్తుగా జరిగే సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఇలాంటి సంఘటనలు అనేకం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం.. కొందరు అలాంటి సంక్షోభాలను ఎదుర్కొన్న బాధితులు కూడా ఉంటారు. ఇటీవల ఇటువంటి సంఘటనే జరిగింది. ఈ ప్రమాదం నుండి చాలా మంది విమాన ప్రయాణికులు తృటిలో తమ ప్రాణాలను రక్షించుకుని బయటపడ్డారు. ఈ ప్రమాద వార్త తెలియగానే నెటిజన్లు ఆందోళనకు గురయ్యారు. అసలు విషయం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

యుఎస్ నేవీకి చెందిన ఒక నిఘా విమానం, అంటే నేవీకి చెందిన ఒక పెట్రోలింగ్ విమానం, ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి హవాయి సమీపంలోని ఓహు ద్వీపం సమీపంలో సముద్రంలోకి వెళ్లింది. ప్రయాణీకుల విమానం, బోయింగ్ పోసిడాన్ 8A, మెరైన్ కార్ప్స్ బేస్ వద్ద రన్‌వే నుండి స్కిడ్ అయింది. దాంతో కనోహే బే ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బందికి గానీ, ప్రయాణికులకు గానీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిసింది. అయితే ప్రమాదం జరిగిన తీరు మాత్రం ఆందోళనకరంగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

యుఎస్ నేవీకి చెందిన ఈ విమానంలో కొంత భాగం సముద్రపు నీటిలో మునిగిపోతున్నట్లు కనిపిస్తోంది. వర్షం, దట్టమైన మేఘాలు, తక్కువ దృశ్యమానత, ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం, ప్రమాదం సమయంలో దృశ్యమానత కేవలం 1.6 కి.మీ మరియు గాలి వేగం 34 కి.మీటర్లు మాత్రమే ఉందని తెలిసింది. ఈ ప్రమాదం తర్వాత ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కానీ, అదృష్టవశాత్తు విమానంలో ఉన్న మొత్తం తొమ్మిది మంది ప్రాణాలతో బయటపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సంఘటన హవాయి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. సైనిక విమానం ప్రస్తుతం సముద్రంలో తేలుతున్న వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

విమానం సముద్రంలో వాలగానే.. ప్రయాణికులు విమానం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని విమానానికి నాలుగు వైపులా ఎమర్జెన్సీ రెస్క్యూ బూత్‌లను ఏర్పాటు చేశారు విమాన సిబ్బంది. మరోవైపు ప్రయాణికుల ప్రాణాలు కాపాడామని మెరైన్ అధికారులకు కూడా సమాచారం అందించారు.
ఈ విమానం US నౌకాదళం తరపున సముద్ర సరిహద్దులో పెట్రోలింగ్ కోసం మోహరించింది. నేవీకి సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, పోసిడాన్ 8A చాలా ముఖ్యమైన విమానమని, 275 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ విమానం నేవీకి ఎంతగానో సహాయం పడుతుంది. ఎంతో రహస్య సమాచారాన్ని సేకరించేది. ఈ విమానాన్ని నావికాదళం సైనిక వ్యాయామాలు, పెట్రోలింగ్, అనేక ఇతర పనులలో సహాయం చేస్తుందని తెలిసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..