AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ కొండచిలువతో ఆడుకుంటున్న మహిళ.. ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది.. వీడియో చూస్తే వణుకే..!!

ఈ వీడియోకు 3,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ప్రాణభయం ఉన్నా కొండచిలువను పెంపుడు జంతువుగా పట్టుకుని ఆడుకుంటున్న దృశ్యం వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె ధైర్యవంతురాలని కొందరు చెబుతుండగా, మరీ అంత భయం లేకుండా విషసర్పాలు, భయనక జంతువులతో ఆడుకోవటం సరికాదని మరికొందరు అంటున్నారు.

భారీ కొండచిలువతో ఆడుకుంటున్న మహిళ.. ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది.. వీడియో చూస్తే వణుకే..!!
Women Hold Python
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2023 | 7:44 PM

Share

వైరల్ వీడియోలు సాధారణంగా వినోదాత్మకంగా ఉంటాయి. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తాయి. కొన్ని వీడియోలు ఎడ్యుకేషనల్ అయితే కొన్ని జీవిత పాఠాలకు సంబంధించినవిగా ఉంటాయి. సోషల్ మీడియాలో మనుషుల వీడియోల కంటే ఎక్కువగా జంతువుల వీడియోలకే ఎక్కువ ఆదరణ ఉంటుంది. జంతువుల జీవన విధానం, వేట, దాడి వంటి వాటి ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అవును…ఈ సారి ఓ పైథాన్‌కు సంబందించిన వీడియో ఇది. అయితే, పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. ఒక పెద్ద కొండచిలువ ఒక్కసారి దాడి చేసి మిమ్మల్ని చుట్టేస్తే ఎలా ఉంటుంది.. దాని బలం నుండి తప్పించుకోవడం ఇక అసాధ్యమనే చెప్పాలి. కొండచిలువ ఏదైనా ఒక జంతువు, మనిషిపై దాడి చేసిందంటే..అదివారి చుట్టూ చుట్టి ఎముకలు విరిగిపోయి ప్రాణం పోయేలా చేస్తుంది. అలాంటి ఓ భయంకర కొండచిలువ వీడియో ఇక్కడ వైరల్‌ అవుతుంది.

తాజాగా ఓ వీర వనిత వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అక్క ధైర్యానికి సలామ్ అంటూ ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. ఒక రాక్షస కొండచిలువను ఓ మహిళ ఒట్టి చేతులతో పట్టుకుని ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. @shital_kasar_official_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ ఓ మహిళ ధైర్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు 3,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ప్రాణభయం ఉన్నా కొండచిలువను పెంపుడు జంతువుగా పట్టుకుని ఆడుకుంటున్న దృశ్యం వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె ధైర్యవంతురాలని కొందరు చెబుతుండగా, మరీ అంత భయం లేకుండా విషసర్పాలు, భయనక జంతువులతో ఆడుకోవటం సరికాదని మరికొందరు అంటున్నారు.

ఇకపోతే, ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ ఇళ్లల్లో పెంపుడు కుక్కల మాదిరిగానే విష సర్పాలు, కొన్ని రకాల పాములు, క్రూరమృగాలను కూడా తమ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. వాటితో పాటుగానే తినటం, పడుకోవటం వంటి పనులు కూడా చేస్తున్నారు. అలాంటి వారి ఇళ్లల్లో పెద్దలు మాత్రమే కాదు.. చిన్న పిల్లలు కూడా వాటితోనే ఆడుకుంటున్నారు. పసిపిల్లలు కూడా విష సర్పాలతో కలిసి నిద్రిస్తున్న ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..