ఇప్పుడైతే.. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అని.. వీటిల్లో మన డబ్బును ఇన్వెస్ట్ చేస్తూ.. దాచుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో ప్రజలు తమ ధనాన్ని దొంగలు దొంగలించకుండా ఉండేందుకు ఇంటి కింద.. మట్టిలో గొయ్యి తీసి దాచుకునేవారు. ఇలా ఈ కాలంలో అనేక చోట తవ్వకాలు చేపట్టడం ద్వారా ఆ పురాతన నాగరికత ప్రపంచానికి తెలుస్తోంది. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నివాసముంటున్న జాన్ రేయేస్, అతడి భార్య ఎలిజబెత్ చనిపోయిన తన మామ అయిన ఫ్రిట్జ్ ఇంట్లోని నేలమాళిగలో సుమారు 1 మిలియన్ రాగి నాణేలను కనుగొన్నారు. గత కొన్నేళ్లుగా ఇవన్నీ కూడా బస్తాలుగా అక్కడే ఉన్నట్లు గుర్తించారు.
నివేదికల ప్రకారం, రేయేస్, అతడి భార్య ఆ రాగి నాణేలను మార్చేందుకు ఓ బ్యాంకు కోసం వెతికారట. వారికి ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఇక చేసేదేమిలేక ఓ ఈ-కామర్స్ యాప్‌లో 25 వేల డాలర్లకు వీటిని విక్రయానికి పెట్టారు. కాగా, 90లలో జర్మనీ నుంచి వలస వచ్చిన రేయేస్ మామగారైన ఫ్రిట్జ్, అతడి సోదరుడు రెండు దశాబ్దాలుగా అదే ఇంట్లో ఉన్నారని ఫాక్స్ న్యూస్ కథనంలో పేర్కొంది. ఇక ఫ్రిట్జ్ చనిపోయిన అనంతరం అతడి సోదరుడు అక్కడ నుంచి వేరే చోటకు మారిపోయాడు. ఆ తర్వాత ఆ ఇంటిని పునరుద్దరించేందుకు క్లీన్ చేస్తుండగా జాన్ రేయేస్, అతడి భార్య ఎలిజబెత్‌కు ఈ నిధి దొరికింది.(Source)