వాషింగ్టన్, సెప్టెంబర్ 30: బీరు కోసం ఓ జంట తమ కన్నబిడ్డను విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్ అర్కాన్సస్‌కు చెందిన డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్‌కు మూడు నెలల మగ శిశువు సంతానం. వీరు మూడు నెలల పిల్లాడిని బీరు, డబ్బు కోసం విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేరం రోజర్స్‌లోని క్యాంప్‌గ్రౌండ్‌లో జరిగినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లారు. అయితే వారు అక్కడికి చెరుకోగా.. అక్కడ బిడ్డ మాత్రమే కనిపించారు. తల్లిదండ్రులు ఎవ్వరూ కనిపించలేదు.
వెయ్యి డాలర్ల (సుమారు రూ.83 వేలు) డబ్బు, బీరు కోసం తమ కొడుకును విక్రయిస్తున్నట్లు డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్‌పై అధికారులకు ఫిర్యాదు వచ్చింది. వీరు సెప్టెంబర్ 21న తమ కుమారుడి విక్రయించేందుకు యత్నించారు. పిల్లాడి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు ఉన్నాయని అత్యవసర వైద్య సహాయం అవసరమని కాల్ చేసి చెప్పారు. అయితే రాత్రిపూట వచ్చి పిల్లాడిని తీసుకెళ్లమని చెప్పారు. దీనిపై ఓ వ్యక్తి సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ బిడ్డ తల్లిదండ్రులు కనిపించలేదు. పిల్లాడిని వెంటనే అధికారులు దవాఖానకు తరలించారు. బిడ్డ తల్లిదండ్రులు నివసించిన గుడారంలో వారు తమ బిడ్డను వెయ్యి డాలర్లకు అమ్మేయడానికి అంగీకరించిన లేఖను అధికారులు గుర్తించారు. బిడ్డకు బదులుగా వెయ్యి డాలర్లు క్యాష్ చెక్కు, బీరు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. తల్లిదండ్రులిద్దరూ లేఖపై సంతకం చేసిన సెల్‌ఫోన్ వీడియోను అధికారులు సేకరించారు. ఈ వ్యవహారంలో నిందితులుగా తేలిన సదరు జంటను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. ఓ జంట తమ బిడ్డ దత్తత తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దత్తత తీసుకోవడానికి సోమవారం వారు ప్లాన్ చేశామని, అందుకే వీడియోను రికార్డ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో అధికారులు చిన్నారి తల్లిదండ్రులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. పిల్లల సంక్షేమానికి హాని కలిగించే నేరారోపణపై వారిని స్థానిక జైలులో ఉంచారు. ఒక్కొక్కరిపై 50 వేల డాలర్లకు బాండ్ తీసుకుని, నిందితులిద్దరినీ గురువారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు తిరిగి అక్టోబరు 29న కోర్టుకు హాజరుకావాల్సి ఉందని తెలిపారు.