ప్రస్తుతం మన దేశంలో జరిగే వివాహా వేడుకలు చాలా ఖరీదైనవిగా మారాయి. పెళ్లి పనుల్లో అత్యంత ముఖ్యమైనది శుభలేఖలు. పెళ్లికి కార్డులు ప్రింట్ చేయడానికి నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభమవుతాయి. పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న, పెద్ద అంశానికి సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తక్షణమే షేర్ చేయబడతాయి. ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి పెళ్లి కార్డు ఒకటి వైరల్‌గా మారింది. ఈ కార్డ్ వైరల్ కావడానికి ప్రత్యేక కారణం ఉంది. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్‌లోని ఇటా జిల్లాలోని బిచ్‌పురి గ్రామానికి చెందిన రోహిత్, రజనీల వివాహానికి సంబంధించిన ఈ కార్డు ఏప్రిల్ 15న ముద్రించబడింది. రోహిత్, రజనీల పెళ్లి ఒకే రోజు. అయితే ఈ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ కార్డ్ వైరల్‌గా మారడానికి కారణం.. దాని రూపం, భాష కాదు.. వెడ్డింగ్ ఇన్వెటేషన్ కార్డులో రాసిన ఒక లైన్..అదేంటంటే.. వారి స్నేహితుల్లో ఒకరిని పెళ్లికి రావొద్దంటూ చాలా ఘాటుగా రాశారు.
ఉపేంద్ర, కమల్, ఇమ్రాన్, రాజేష్, దల్వీర్ వంటి వ్యక్తుల పేర్లు కార్డులో ఉన్నాయి. అయితే దానితోపాటు ఓ నోట్ కూడా ఉంది. అదేంటంటే, ‘సౌరభ్ పెళ్లికి రావడం పూర్తిగా నిషేధం. అతని ఉనికి కూడా మేం అంగీకరించం.. అతను ఎక్కడైనా కనిపిస్తే తరిమి కొట్టండి. అందరినీ ఆహ్వానించిన తర్వాత స్నేహితుడిని పెళ్లికి పిలవకపోవడమే కాకుండా ఎక్కడైనా కనిపిస్తే తరిమి కొట్టాలని సూచించడంతో సోషల్ మీడియా యూజర్లు షాక్ అయ్యారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ కార్డ్‌ని ‘సౌరభ్’ అనే వారి తెలిసిన స్నేహితులకు షేర్ చేస్తూ ఫన్నీగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన అనేక మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో ‘సౌరభ్’ అనే సోషల్ మీడియా యూజర్లు రెచ్చిపోయారు. సౌరభ్ మాజీ ప్రియురాలిని రోహిత్ పెళ్లి చేసుకుంటున్నాడా అంటూ చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..