
ప్రపంచవ్యాప్తంగా వింతైన ప్రదేశాలకు కొదువ లేదు. అందరినీ ఆశ్చర్యపరిచే అలాంటి ఒక ప్రదేశం గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. వచ్చేపోయే వాహనాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డు మధ్యలో నిర్మించిన ఒక విలాసవంతమైన హోటల్ కథ తెలిస్తే మీరు షాక్ తింటారు. అది ముందు ఎలా ఉండేదో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. కానీ, దాని చరిత్ర ఎంతగా అంటే అది ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటుంది. అది ఆక్స్‌ఫర్డ్‌లోని సెయింట్ గైల్స్ రోడ్ మధ్యలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ హోటల్ ‘ది నెట్టీ’. ఇక్కడకు వెళ్లేందుకు మీరు మొదట మెట్లు దిగాలి. పై అంతస్తులో నిరంతర సందడి, బైకులు, కార్లు, బస్సులతో వచ్చే రణగోణధ్వనులు ఉండగా, కింది అంతస్తులో మాత్రం నిశ్శబ్దమైన, హాయిగా ఉండే ప్రపంచం మీ కోసం వేచి ఉంది. కానీ ఈ నిశ్శబ్ద ప్రదేశానికి సబంధించిన నిజం మాత్రం అంత నిశ్శబ్దంగా ఉండదు.
అవును! విక్టోరియన్ శకంలో మగవారి కోసం నిర్మించిన రెస్ట్‌రూమ్ ఇక్కడే ఉండేదట. క్లాసిక్ సిరామిక్ టైల్స్, ఐరన్ రెయిలింగ్‌లు, పాత బ్రిటిష్ వాస్తుశిల్పం అన్నీ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు తిరిగి మరమ్మతులు చేయించారు. ఈ పబ్లిక్ రెస్ట్‌రూమ్ 2008 వరకు పనిచేసింది. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడింది. ఇది 11 సంవత్సరాలు నిరూపయోగంగా ఉంది. ఆ తరువాత సంచలనాత్మక ఆలోచన చేశారు. మూసివేసిన టాయిలెట్లతో హాయిగా నిద్రపోయేందుకు అద్భుతమైన లగ్జరీ హోటల్ నిర్మాణం వైరల్‌గా మారింది. ఈ మేకోవర్ 2019 లో ప్రారంభమైంది. పాత టాయిలెట్ అలాగే ఉంది, కానీ, దానికి విలాసవంతమైన కొత్త రంగును తీసుకువచ్చారు.
ఇప్పుడు ఆ గదుల్లో కింగ్ సైజు బెడ్. రెయిన్‌ఫాల్, మినీ బార్, వై-ఫై సదుపాయం, వింటేజ్ థీమ్ డెకర్‌తో లగ్జరీగా హోటల్‌గా తయారైంది. మరి ఇక్కడికి వచ్చే అతిథులకు అద్దె ఎంత ఉంటుందో ఊహించ గలరా..? అది తెలిస్తే మరింత షాక్ అవుతారు.. ఒక రాత్రికి దాదాపు 20,000 రూపాయలు. బుకింగ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి. డేట్ దొరకడం కూడా కష్టం. హోటల్ మేనేజర్ అనా పిన్హీరో ప్రకారం, ఈ ప్రదేశం అందరికీ కాదు… కానీ, ప్రత్యేకత, చరిత్రను ఇష్టపడే వారికి ఇది ఒక టైమ్-ట్రావెల్ అనుభవం అవుతుందని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..