Tesla Car Burnt: రూ.కోట్లు పెట్టి కొన్నాడు.. కంపెనీపై కోపంతో కారునే పేల్చేశాడు.. వీడియో వైరల్..

|

Dec 21, 2021 | 9:45 AM

Tesla Car Blast With Dynamite: కారు కొనాలన్న కోరికను నిజం చేసుకున్నాడు. కోట్ల విలువైన కారును కొన్నాడు. దానిలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ఏకంగా ఆ కారును పేల్చేశాడు. ఈ ఘటన ఫిన్లాండ్‌లో

Tesla Car Burnt: రూ.కోట్లు పెట్టి కొన్నాడు.. కంపెనీపై కోపంతో కారునే పేల్చేశాడు.. వీడియో వైరల్..
Tesla Car Blast
Follow us on

Tesla Car Blast With Dynamite: కారు కొనాలన్న కోరికను నిజం చేసుకున్నాడు. కోట్ల విలువైన కారును కొన్నాడు. దానిలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ఏకంగా ఆ కారును పేల్చేశాడు. ఈ ఘటన ఫిన్లాండ్‌లో చోటుచేసుకుంది. వాస్తవానికి ప్రపంచ మార్కెట్లో టెస్లా కార్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తమ కార్లకు కొత్త టెక్నాలజీ జోడిస్తూ వినియోగదారులను ఈ కంపెనీ అమితంగా ఆకర్షిస్తుంది. మంచి ఫీచర్లు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో టెస్లా కార్లు కస్టమర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డ్రైవర్ లెస్ కార్లు సడన్‌గా ఆగిపోతుండగా, మరికొన్ని కార్లు సాంకేతిక సమస్యలతో షెడ్డుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అసలు ఈ యువకుడు కారును ఎందుకు పెల్చాడో ఇప్పుడు తెలుసుకుందాం..

దక్షిణ ఫిన్‌లాండ్‌లోని కైమెన్‌లాక్సోకి చెందిన త్వామ‌స్ కటైనెన్ అనే వ్యక్తి టెస్లా కారును కొనుగోలు చేశారు. ఆ తర్వాత కారు సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. మొద‌టి 1500 కిలోమీట‌ర్లు చాలా అద్భుతంగా ప్రయాణించిన టెస్లా కారు.. ఆ త‌రువాత ఆగిపోయింది. ఆటోమేష‌న్ సిస్టర్ ఎర్రర్ చూపించడంతో.. యజమాని టెస్లా స‌ర్వీస్ షోరూమ్‌కి తీసుకెళ్లాడు. అయితే అక్కడ సర్వీసింగ్ ఖర్చులు 20000 యూరోలు (17 లక్షలు) అవుతుందని చెప్పడంతో దాన్ని పేల్చి వేయాలని నిర్ణయించుకున్నాడు. అంతమొత్తం ఖర్చు పెట్టి బాగు చేయించడం ఇష్టం లేకపోవడంతో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను కొన్నాడు. అనంతరం మంచుతో కప్పబడి ఉన్న జాలా అనే ప్రాంతానికి తీసుకెళ్లి కారును పేల్చేశాడు. జనావాస ప్రాంతాలకు చాలా దూరంగా వెళ్లి కారుకు 30 డైనమైట్ స్టిక్స్ అమర్చి పేల్చేశాడు.

వీడియో.. 

అయితే.. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు సమాచారామిచ్చాడు. అక్కడికి చేరుకున్న యూట్యూబ్ ఛానెల్ సిబ్బంది ఈ పేలుడు దృశ్యాలను చిత్రీకరించి.. యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. పేలుడు దాడికి కారు ముక్కలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు అనంతరం హెలికాప్టర్‌పై నుంచి టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ బొమ్మను సైతం కిందకు విసిరేశారు. సుమారు కోటి రూపాయల పైనే ఉండే ఈ టెస్లా కారును ఇలా పేల్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also Read:

Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. పిల్లిని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Love Story: మొహం చాటేసిన ప్రియుడు.. మౌనపోరాటానికి దిగిన యువతి.. ఎక్కడంటే..?