AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫుడ్ పాయిజనింగ్‌తో కడుపులో మంట.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లి.. స్కాన్ చేయగా

ఫుడ్ పాయిజనింగ్ కదా అని తేలికగా కొట్టిపారేసింది. తీరా ఎనిమిది వారాలు గడిచిన ఆ లక్షణాలు తగ్గలేదు. తీవ్ర ఆందోళన చెందిన ఆమె హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు టెస్టులు చేయగా.. ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: ఫుడ్ పాయిజనింగ్‌తో కడుపులో మంట.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లి.. స్కాన్ చేయగా
Doctors
Ravi Kiran
|

Updated on: May 26, 2025 | 6:45 PM

Share

సూడోమైక్సోమా పెరిటోని(PMP).. ఈ పేరు మీరెప్పుడైనా విన్నారా.? పలకడానికి నోరు తిరగట్లేదు. ఇదేంటని అనుకుంటున్నారా.! ఇదొక రకమైన క్యాన్సర్. యూకేలోని కుంబ్రియాకు చెందిన 39 ఏళ్ల రెబెక్కా అనే మహిళ.. ఈ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దీని వల్ల ఆమె శరీరంలో నుంచి ఏకంగా 13 అవయవాలను తొలగించాల్సి వచ్చింది. అంతేకాదు ప్రతిరోజూ 50 నుంచి 60 మాత్రలు, నొప్పి నివారణ మందులు, హార్మోన్ థెరపీ లాంటివి చేయించుకుంటోంది. చూశారుగా.! ఆమె ఎంతటి కష్టం అనుభవిస్తోందో.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

39 ఏళ్ల రెబెక్కా డిసెంబర్ 2018లో ఆఫీసులోని క్రిస్మస్ పార్టీకి వెళ్లింది. ఆ పార్టీ తర్వాత ఆమెకు ఈ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు బయటపడ్డాయి. మొదటగా ఫుడ్ పాయిజనింగ్ అనుకుని లైట్ తీసుకుంది. అయితే ఆ లక్షణాలు ఎనిమిది వారాలకుపైగా కొనసాగాయి. దీంతో ఆమె ఆందోళన చెంది.. హుటాహుటిన స్థానిక డాక్టర్‌ను కన్సల్ట్ చేసింది. అక్కడ రెబెక్కాకు కొన్ని టెస్టులు చేసిన డాక్టర్.. ఈ అరుదైన క్యాన్సర్ బారిన పడిందని చెప్పారు.

ఏప్రిల్ 2019లో ఆమెకు మొదట ఆపరేషన్ జరిగింది. 1.6 గ్యాలన్ల కంటే ఎక్కువ మ్యూసిన్, పలు అవయవాలను డాక్టర్లు ఆపరేట్ చేశారు. ఆ తర్వాత ఎనిమిది క్లిష్టమైన కీమోథెరపీ రౌండ్లు చేయించుకుంది. అంతటితో ఆమె చికిత్స ఆగలేదు. నవంబర్ 2019లో మరో పెద్ద ఆపరేషన్ ద్వారా ఆమె పిత్తాశయం, పెద్ద ప్రేగు, గర్భాశయం, అండాశయాలు లాంటి 13 అవయవాలను తొలగించాల్సి వచ్చిందని అంతర్జాతీయ మీడియా ఓ కథనంలో పేర్కొంది. ఆపై తనకున్న ఈ వ్యాధి బారినపడ్డవారికి సాయం చేసేందుకు పూనుకుంది రెబెక్కా. GoFundMe పేరిట ఓ ప్రచారాన్ని ప్రారంభించింది.