World record: చరిత్రలో అత్యంత విచిత్రమైన, ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలను సంగ్రహించడంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రసిద్ధి చెందిందని మనందరికీ తెలుసు. అది ఆహారం విషయంలోనూ వరల్డ్ రికార్డ్స్ ఉండనే ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చికెన్ నగెట్‌ను తయారు చేస్తున్న చెఫ్ అయినా, అత్యధిక జామ్ డోనట్స్ రికార్డును బద్దలు కొట్టిన మహిళ అయినా, ఈ రికార్డులన్నీ ఆశ్చర్యకరమైనవి. అసంబద్ధమైనవి ఈ వాస్తవ విషయాలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఇకపై ఆహారం కేవలం మనుగడకు, జీవనోపాధికి మాత్రమే కాదు. ఇది సృజనాత్మకత, భావోద్వేగం, అభిరుచి, వ్యక్తీకరణగా కూడా మారింది. తాజాగా ఆహారానికి సంబంధించి మరో అద్వితీయ రికార్డు సృష్టించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే, ఈసారి ఇది యునైటెడ్ కింగ్‌డమ్ నుండి కొంత ప్రత్యేకమైన, ఆసక్తికరమైన అంశంపై ఓ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకున్నాడు.
అవును.. ఇది నిజంగా ఆసక్తికర అంశమే..ఎందుకంటే.. ఇక్కడ ఒక రైతు తన పొలంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన దోసకాయను పండించడంలో విజయం సాధించాడు. ఈ రికార్డు సాధించిన ఘనత సాధించాడు యూకే కి చెందిన సెబాస్టియన్ సుస్కీ అనే రైతు. పొడవైన దోసకాయ అనేది కుకుమిస్ సాటివస్ నమూనా మాత్రమే అని మీకు తెలియజేద్దాం. ఇది ఇతర సాధారణ ఖీరాల మాదిరిగానే అతడు తన పొలంలో నాటాడు..కానీ, అతడు తీసుకున్న శ్రద్ధ, అనుకూల పరిస్థితుల నేపథ్యంలో అతడు గిన్నిస్ రికార్డ్ సాధించాడు. ఈ దోసకాయ పొడవు 113.4 సెం.మీ.లు
అలాంటి రికార్డును బద్దలు కొట్టిన కూరగాయలు ఇది ఒక్కటే కాదు.. ఇంతకుముందు పెద్ద కూరగాయల జాబితాలో మరెన్నో కూరగాయలు రికార్డులు సృష్టించాయి. గతంలో 3.12 కిలోల వరకు వంకాయలు పండించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫోటోలను షేర్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి