అక్కడి ప్రజలు లోదుస్తులను భూమిలో పాతిపెట్టారట.! అదేమైనా ఆచారమా.? లేక సంప్రదాయమా.? అని అనుకుంటే పొరపాటే.. ఇలా చేయడం వెనుక బలమైన కారణం ఉంది. ఆ విషయాన్ని తెలుసుకుంటే మీరు కూడా ఆసక్తిని కనబరుస్తారు. అవునండీ.. ఇది నిజం.. ఈ తరహా చిత్రమైన విషయాలు స్విట్జర్లాండ్‌లో జరుగుతున్నాయి. అక్కడి పొలాల యజమానులు మట్టి నాణ్యతను తెలుసుకునేందుకు తెల్లని లోదుస్తులను భూమిలో పాతిపెడుతున్నారు.
ఈ అధ్యయనం స్టేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అగ్రోస్కోప్ చేపడుతోంది. పరిశోధనల్లో పాల్గొన్న వాలంటీర్లకు రెండు తెల్లటి కాటన్ లోదుస్తులను మట్టిలో పూడ్చిపెట్టేందుకు పంపిస్తోంది. ఆ తర్వాత ఈ లోదుస్తులను సూక్ష్మజీవులు ఎంతలా నాశనం చేశాయన్న దానిని పరిశీలిస్తోంది. ఈ లోదుస్తులను పూడ్చిపెట్టిన రోజు నుంచి కొన్ని నెలల వ్యవధి తర్వాత బయటికి తీసి.. జూరిచ్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు వాటిని పరిశీలిస్తారు. ఏయే సూక్ష్మజీవులు ఈ లోదుస్తులను నాశనం చేశాయో తెలుసుకునేందుకు వాటిపై డీఎన్‌ఏ జాడల గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు.
ఈ ప్రాజెక్టు హెడ్ మార్సెల్ మాట్లాడుతూ.. నేల నాణ్యతను తెలుసుకునేందుకే ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నామని.. లోదుస్తులను గడ్డి మైదానాలు, పొలాలు, చెట్ల కింద పూడ్చిపెడతామని అన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా మొదటిసారి మట్టి నుండి లోదుస్తులను తీసి వాటి ఫోటోలను తీస్తాం. ఆ తర్వాత నెల తర్వాత మరోసారి లోదుస్తులను బయటకు తీసి పరీక్షిస్తాం. లోదుస్తులపై ఎక్కువగా రంధ్రాలు ఉంటే, నేల ఆరోగ్యంగా ఉందని అర్థం అని చెప్పుకొచ్చారు.
Also Read:
ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..
మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..
కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూరలో నక్కిన పాము.. భయానక వీడియో.!