Viral Video: పాముల లిప్ లాక్.. అయ్య బాబోయ్ నేను ఎప్పుడూ చూడలేదు గురూ..!
పాముల వీడియోలు డైలీ నెట్టింట కనిపిస్తూనే ఉంటాయి. పాములు అంటే భయం ఉంటుంది కానీ.. వీడియోలు చూడటంలో మాత్రం ఎవ్వరూ వెనక్కి తగ్గరు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రెండు పాములు రొమాన్స్ చేస్తూ కనిపించాయి. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

స్నేక్ వీడియోలకు నెట్టింట ఓ రేంజ్ వ్యూయర్షిప్ ఉంటుంది. పాములకు ఏ సంబంధించిన ఏ వీడియో పోస్ట్ చేసినా.. నెటిజన్స్ పక్కా చూస్తారు. అందులో దూకుడుగా ఉండే తాచుపాము కదలికలను ఆసక్తిగా గమనిస్తారు. మాములు పాముల రొమాన్స్ అంటే సయ్యాట అని మనకు తెల్సు. రెండు పాములు పెనవేసుకుని.. గంటల తరబడి నాట్యం చేస్తాయి. అయితే ఈ పాములు కాస్త డిఫరెంట్. ఇక్కడ రెండు పాములు లిప్ లాక్ ట్రై చేశాయి. ఏంటి నమ్మడం లేదా..? అయితే మీరు దిగువన వీడియో చూడాల్సిందే.
View this post on Instagram
రెండు పాములు చక్కగా ఒక దాని కళ్లలో మరొకటి కళ్లు పెట్టి చేరువవ్వడం మీరు చూడవచ్చు. ఆ తర్వాత చుంబనం జరిగినట్లుగా సీన్ కనిపించింది. ఆ రెండింటిలో పడగవిప్పి ఉన్న పాము.. నాగుపాము అని స్పష్టంగా అర్థమవుతుంది. రెండో పాము ఏంటి అన్నది తెలియడం లేదు. ఈ పాముల రొమాన్స్‌ను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాములు కూడా తగ్గట్లేదు.. మా లైఫ్ వేస్ట్ అంటూ కొందరు సరదాగా కామెంటత్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
