సాధారణంగా చిన్న చిన్న కొలనుల్లో జాలర్లు చేపలను ఎక్కువగా పడుతుంటారు. జాలర్లు మాత్రమే కాదు కొంతమంది వ్యక్తులు కూడా ఫిషింగ్ చేస్తుంటారు. అలాగే మరొకొందరు టైం పాస్‌కు కూడా ఫిషింగ్ చేస్తారు. చిన్న కర్రకు ఓ కొక్కెం తగిలించి దానికి ఎరను కట్టి చేపలను పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఇదంతా సర్వ సాధారణం. అయితే ఇక్కడ చెప్పబోయేది వింటే.. మీరు నిజంగానే షాక్ అవుతారు. ఓ ఇద్దరు వ్యక్తులు చేపల కోసం ఎర వేస్తారు. అయితే వారిని షాక్‌కు గురి చేస్తూ.. ఆ ఎరను చేజిక్కించుకునేందుకు వేగంగా బయటికి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని అంటారు. దానికి నీళ్లలో వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. ఏ జంతువు వచ్చినా కూడా క్షణాల్లో మట్టుబెట్టేస్తుంది. అంతటి బలశాలి అయినా మొసలితో ఎవ్వరూ కూడా గేమ్స్ ఆడటానికి ప్రయత్నించరు. ఆ మొసలికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు వ్యక్తులు ఎరను త్రాడుకు కట్టి నీళ్లలోకి విసురుతారు. ఆ కొలనులో మొసలి ఎక్కడుందో తెలియదు గానీ.. వీళ్లు విసిరిన ఎరకు చేపలకు బదులుగా ఆ మొసలి వేగంగా ఈదుకుంటూ వారిపైకి వస్తుంది. ఇద్దరూ కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. వీడియోను పరిశీలిస్తే.. ఆ మొసలిని పట్టుకోవడానికే వారిద్దరూ వల పన్నారని అర్ధమవుతుంది. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.!