Viral Video: మంచు కారణంగా గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే..?

|

Dec 30, 2022 | 11:03 AM

ప్రస్తుతం అమెరికా, కెనడా వంటి కొన్ని దేశాలలో మంచు విపరీతంగా పడుతుంది. అక్కడి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఒక జింకకు..

Viral Video: మంచు కారణంగా గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే..?
A Deer With Its Mouth,eyes & Ears Completely Frozen Over Due To The Extreme Cold Weather
Follow us on

ప్రస్తుతం అమెరికా, కెనడా వంటి కొన్ని దేశాలలో మంచు విపరీతంగా పడుతుంది. అక్కడి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి. ఇక చల్లని తుపాను ప్రభావం, చలి తీవ్రతతో అక్కడి జనజీవనం అతలాకుతలంగా మారింది. ఇళ్లు ఉన్న మనుషుల పరిస్థితే అలా ఉండే షెల్డర్ కూడా లేని జంతువుల స్థితి ఏమిటో ఆలోచించండి. వాటి బాధలు అంతా ఇంతా కావు. ఇక అవి ఈ మంచులో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో మీకు తెలుసా..? తెలుసుకోవాలనుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను తప్పక చూడాల్సిందే. ఈ వీడియోను చూస్తే మనసు కరిగిపోవాల్సిందే.

ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోలో కళ్లు, చెవులు, పూర్తిగా ముఖమే గడ్డ కట్టుకుపోవడంతో ఇబ్బంది పడుతున్న ఒక జింకను మనం చూడవచ్చు. రోడ్డున వెళ్తున్న ఇద్దరు బాటసారులకు అది కనబడడంతో దానికి సహాయం చేసి, దాని ముఖంపై ఉన్న మంచు గడ్డలను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు జింకకు సహాయం చేసిన బాటసారులను ప్రశంసలతో ముంచెత్తారు.

నెట్టింట వైరల్ అవుతున్న జింక వీడియోను ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

జింకకు సంబంధించిన ఈ వీడియోపై నెటిజన్లు ఎంతో జాలిగా స్పందిస్తున్నారు. ‘మీరు చేసిన పని చాలా ఆదర్శవంతమైనది సోదరా..’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘జింక నిద్రిస్తున్నప్పుడు మంచు తుఫాను కారణంగా ఈ పరిస్థితికి వచ్చి ఉండవచ్చ’ని మరో నెటిజన్ అంచనా వేశాడు. ఇలా నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.