Viral Video: వామ్మో.. ఎలుకలను ఒకేసారి మింగేసిన రెండు తలల పాము.. వీడియో చూస్తే వణుకు పుట్టడం ఖాయం..

Snake Viral Video: ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ఈ రోజుల్లో

Viral Video: వామ్మో.. ఎలుకలను ఒకేసారి మింగేసిన రెండు తలల పాము.. వీడియో చూస్తే వణుకు పుట్టడం ఖాయం..
Two Headed Snake Video

Updated on: Dec 08, 2021 | 9:36 AM

Snake Viral Video: ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ఈ రోజుల్లో గూస్‌బంప్స్ చేసే వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం వణికిపోతారు. పాము అంటే ఒక్కసారిగా ఒళ్లు జలధరిస్తుంది. ఎక్కడో తెలియని భయం వెంటాడుతుంది. అయితే.. ఈ వైరల్ అవుతున్న వీడియోను చూస్తే.. అందరికీ గగుర్పాటు కలిగడంతోపాటు భయమేస్తుందంటున్నారు నెటిజన్లు.. మీరు ఇప్పటి వరకు ప్రమాదకరమైన పాములను చూసే ఉంటారు. అయితే, మీరు ఎప్పుడైనా రెండు తలల పామును చూశారా? మీరు చూడకుంటే ఇప్పుడే చూడండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వీడియోలో రెండు తలల పాము ఏకకాలంలో రెండు ఎలుకలను మింగుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఈ పాము టైరు మధ్యలో తిష్టవేసినట్లు మీరు చూడవచ్చు. దీనిలో రెండు ఎలుక పిల్లలు కూడా కనిపిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాము ఏకకాలంలో రెండు నోళ్లతో ఎలుక పిల్లలను వేటాడుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..

షాకింగ్ వీడియో.. 

ఈ వైరల్ వీడియోను.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేక్ వరల్డ్ అనే ఖాతా షేర్ చేసింది. ఇది ఇప్పటివరకు 10 వేలమందికి పైగా వీక్షించారు. సోషల్ మీడియా యూజర్స్ ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతూ.. పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రెండు తలలపాము ఒక్కసారిగా వేటాడుతున్న దృశ్యాన్ని ఇప్పటివరకు చూడలేదని.. ఈ వీడియో భయంకరంగా ఉందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

Also Read:

Musheerabad water tank: అసాంఘిక కలాపాలకు అడ్డాగా వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతం.. డెడ్‌ బాడీతో వెలుగులోకి కొత్త కోణాలు

Andhra Pradesh: ఎంపీడీవోను దూషించిన వైసీపీ నాయకుడు అరెస్ట్.. మరో ముగ్గురిపై కేసు..