Viral: పైకి చూసి సబ్బు పెట్టెలు అనుకునేరు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

|

Oct 14, 2024 | 1:39 PM

కేటుగాళ్లు తెలివి మీరిపోయారు. పుష్పరాజ్‌ను మించి ప్లాన్లు వేస్తూ..మాదకద్రవ్యాలను రాష్ట్ర బోర్డర్లు దాటించేస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా ఏంటి.! వారి ఆటలు కట్టిస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు.

Viral: పైకి చూసి సబ్బు పెట్టెలు అనుకునేరు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
Representative Image
Follow us on

కేటుగాళ్లు తెలివి మీరిపోయారు. పుష్పరాజ్‌ను మించి ప్లాన్లు వేస్తూ..మాదకద్రవ్యాలను రాష్ట్ర బోర్డర్లు దాటించేస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా ఏంటి.! వారి ఆటలు కట్టిస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి తరహ ఘటన ఒకటి అస్సాంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మాదకద్రవ్యాలను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తోన్న ఓ అంతరాష్ట్ర ముఠాను సోమవారం అసోం స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్) పట్టుకుంది. సదరు మాదక ద్రవ్యాలను రవాణా చేస్తోన్న ట్రక్కు నాగాలాండ్ నుంచి గౌహతికి వెళ్తున్నట్టు గుర్తించారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఇన్ఫార్మర్ల పక్కా సమాచారం మేరకు జొరాబత్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. AS 01 RC 2336 నెంబర్ గల ట్రక్కును ఆపి.. చెక్ చేయగా.! హెరాయిన్‌తో నిండిన 45 సబ్బు పెట్టెలను కనుగొన్నారు, వాటి బరువు దాదాపు 537.2 గ్రాములుగా గుర్తించారు. ఆ ట్రక్కు డ్రైవర్ రణంజయ్ మండల్(46)ను అదుపులోకి తీసుకున్నారు. నాగోన్‌లోని బమున్‌కుచికి చెందిన మండల్, కమ్రూప్ జిల్లా, బసిస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగాలీ-బస్తీ ప్రాంతంలో నివాసం ఉండేవాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇది చదవండి: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీరెలాంటి వారో చెప్పేస్తోంది.? ఎలాగంటారా

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..