Viral Photos: పీక్స్‌కి చేరిన పిచ్చి.. ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఫ్లేస్‌లో హానీమూన్ ఫోటో షూట్..

|

Jun 29, 2022 | 7:43 PM

అయితే నార్మల్ ఫోటో షూట్స్ చేస్తే ఓకే.. కానీ కొందరు అందమైన లొకేషన్స్.. డిఫరెంట్ లొకేషన్స్ అంటూ ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు

Viral Photos: పీక్స్‌కి చేరిన పిచ్చి.. ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఫ్లేస్‌లో హానీమూన్ ఫోటో షూట్..
Viral
Follow us on

ప్రస్తుతం ఫోటోషూట్స్ ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్, హానీమూన్ ఫోటోషూట్స్.. ఎంగెజ్మెంట్ ఫోటో షూట్, ప్రెగ్నెన్సీ, బేబీ ఫస్ట్ మంత్… ఇలా ఒక్కటేమిటీ ప్రతి చిన్న సందర్బానికి ఫోటో షూట్స్ చేసేస్తున్నారు. అయితే నార్మల్ ఫోటో షూట్స్ చేస్తే ఓకే.. కానీ కొందరు అందమైన లొకేషన్స్.. డిఫరెంట్ లొకేషన్స్ అంటూ ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఫోటో షూట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా ఓ కొత్త జంట ప్రమాదకరమైన ప్రదేశంలో హానీమూన్ ఫోటో షూట్ నిర్వహించింది.. ప్రస్తుతం వీరి ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఓ కొత్త జంట ప్రపంచంలోనే ప్రమాదకరమైన రైలు రవాణాపై హానీమూన్ ఫోటో షూట్ చేశారు..నార్త్‌వెస్ట్ ఆఫ్రికాలోని మౌరిటానియాకు చెందిన క్రొయేషియన్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు క్రిస్టిజన్ ఇలిసిక్, ఆండ్రియా ట్రిగోవ్‌సెవిక్ జంట తమ హానీమూన్ ఫోటో షూట్ కాస్త విభిన్నంగా చేయాలనుకున్నారు.. అంతే ఎడారి ప్రాంతంలో 2 కి.మీ పొడవున్న ఇనుప సరుకు రవాణా రైలు పై హానీమూన్ ఫోటో షూట్ చేశారు.. తాము అనుకున్నట్లు ఫోటోస్ రావడం కోసం ఈ జంట అత్యంత కఠినమైన పరిస్థితులలో దాదాపు 20 గంటలు ప్రయాణం చేశారు..వీరి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పగటి పూట 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రతలలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా దాదాపు 700 కి.మీ కంటే ఎక్కువ దూరం ఈ రైలు ప్రయాణం 20 గంటలు జరుగుతుంది. ఈ రైలు డు ఎడారి అట్లాంటిక్ తీరంలోని నౌదిబౌ వద్ద ఉన్న ఓడరేవు నుండి అట్లాంటిక్ సముద్రం, నౌధిబౌపై ఉన్న చిన్న ఓడరేవు వరకు వెళ్తుంది. ఇది కేవలం సరుకు రావాణా మాత్రమే చేస్తుంది.. ప్రయాణికులు ఉండరు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.