Viral Video: ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోలేని రైలు..ఒక్క రోజులో లక్షల వ్యూస్ సొంత చేసుకున్న ఫన్నీ వీడియో

|

Sep 25, 2024 | 6:19 PM

నగరంలో రోజూ ఏదో ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇప్పటికీ వాహనదారులు విధులకు వెళ్లే సమయంలో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు.అయితే బెంగుళూరు ట్రాఫిక్ జామ్‌లో ఇప్పటి వరకూ బస్సులు, బైక్‌లు, కార్లు సహ ఇతర వాహనాలు చిక్కుకున్నాయి. అయితే ఇప్పుడు ట్రాఫిక్జామ్ లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న వాహనాల లిస్టు లో రైళ్లు కూడా చేరిపోయాయి.

Viral Video: ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోలేని రైలు..ఒక్క రోజులో లక్షల వ్యూస్ సొంత చేసుకున్న ఫన్నీ వీడియో
Bengaluru Traffic
Image Credit source: social media
Follow us on

మన దేశంలో డిల్లీ, ముంబై, బెంగలూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ట్రాపిక్ జామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు వాహనదారులు. ఐటీకి అద్దా గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియాగా కీర్తింపబడే బెంగళూరులో ట్రాఫిక్ జామ్ సమస్య కొత్త కాదు. నగరంలో రోజూ ఏదో ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇప్పటికీ వాహనదారులు విధులకు వెళ్లే సమయంలో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు.అయితే బెంగుళూరు ట్రాఫిక్ జామ్‌లో ఇప్పటి వరకూ బస్సులు, బైక్‌లు, కార్లు సహ ఇతర వాహనాలు చిక్కుకున్నాయి. అయితే ఇప్పుడు ట్రాఫిక్జామ్ లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న వాహనాల లిస్టు లో రైళ్లు కూడా చేరిపోయాయి. ట్రాఫిక్ జామ్‌లో రైలు చిక్కుకుపోయిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు బెంగుళూరులో ఏదైనా సాధ్యమే అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఘటన బెంగళూరులోని మారతహళ్లి సమీపంలోని మున్నెకోళ్ల రైల్వే క్రాసింగ్‌ దగ్గర చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సుధీర్ చక్రవర్తి (sudhirchakravarthi4142) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, “నువ్వు లేదా నేను కాదు.. రైలు కూడా బెంగుళూరు ట్రాఫిక్ నుండి తప్పించుకోలేదు” అని క్యాప్షన్ పెట్టారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వాహనాల రద్దీ కారణంగా మారతహళ్లి సమీపంలోని మున్నెకోళ్ల రైల్వే క్రాసింగ్ సమీపంలో ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియో 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు, “రైలు ఎందుకు ఆలస్యం అవుతుందని స్టేషన్ మాస్టర్ అడుగుతున్నారంటే, లోకో పైలట్ ట్రాఫిక్ సమస్యే కారణమని” ఒక ఫన్నీ కామెంట్ రాశారు. మరో వినియోగదారు మాట్లాడుతూ.. రైలు దాటే ప్రతిసారీ మనం క్రాసింగ్ దగ్గర వేచి ఉంటాం.. ఈసారి రైలు మనకోసం ఎదురుచూడాలి అని చమత్కరించాడు. ఇంకా రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..