పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు ఆరా తీయగా కళ్లు బైర్లు కమ్మేసీన్..?

|

Nov 13, 2024 | 11:54 AM

యదా విధిగానే పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్తున్న పెట్రోలు తరలిస్తున్న లారీ కంటైనర్‌ను అడ్డుకున్న పోలీసులకు ఏదో తేడాగా అనిపించింది. దాంతో పెట్రోల్‌ ట్యాంకర్‌ వాహనాన్ని పక్కగా ఆపించేశారు.. వెంటనే ఓ బుల్‌డోజర్‌ వాహనాన్ని రప్పించారు.

పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు ఆరా తీయగా కళ్లు బైర్లు కమ్మేసీన్..?
Petrol Tanker
Follow us on

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నేరస్థులు ప్రతిసారీ కొత్త కొత్త ట్రిక్స్‌ ప్లే చేస్తుంటారు. ఈ సారి సినీ ఫక్కీలో మూగజీవాలైన ఆవుల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు దుండగులు. వారి ప్లాన్‌ ఎలా ఉందంటే..కనిపెట్టడం దాదాపు అసాధ్యమని చెప్పాలి. కానీ, పోలీసులు మాత్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి గోవులను తరలిస్తున్న పెట్రోల్ కంటైనర్ లారీని పట్టుకున్నారు. పెట్రోల్‌ ట్యాంకర్‌లో ఆవులను ఎలా తరలిస్తున్న చూసిన ఖాకీలే కాదు.. వీడియో చూసిన ప్రతి ఒక్కరు షాక్‌ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

రోజు మాదిరిగానే పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్తున్న పెట్రోలు తరలిస్తున్న లారీ కంటైనర్‌ను అడ్డుకున్న పోలీసులకు ఏదో తేడాగా అనిపించింది. దాంతో పెట్రోల్‌ ట్యాంకర్‌ వాహనాన్ని పక్కగా ఆపించేశారు.. వెంటనే ఓ బుల్‌డోజర్‌ వాహనాన్ని రప్పించారు. దాంతో పెట్రోల్‌ ట్యాంకర్‌ను పగులగొట్టించగా లోపల కనిపించిన దృశ్యం అందరినీ విస్తూ పోయేలా చేసింది. ట్యాంకర్‌ నిండా కనిపించిన గోవుల్ని తరలిస్తుండటం చూసి చలించిపోయారు. గోవుల స్మగ్లింగ్‌ ఇలా కూడా జరుగుతుందా..? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. వేల లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌తో కూడిన కంటైనర్‌లు, రోడ్లపై నడిచే భారీ ట్రక్కుల్లో పైకి కనిపించేది కాదు.. ఇంకేదైనా జరుగుతూ ఉండవచ్చునని అందరిలోనూ ఒక ఆందోళన నెలకొంది. సామాన్య ప్రజలేవరూ కూడా ఇలాంటిది ఊహించలేరు కూడా. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ స్మగ్లింగ్ జరుగుతున్న ట్రక్కు. దానిపై జార్ఖండ్ నంబర్ ప్లేట్ అమర్చారు. నంబర్ ప్లేట్‌పై JK 03 E 5451 అని రాసి ఉన్నట్టుగా గుర్తించారు. ఇది చూసి చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు షాక్ అవుతున్నారు. కామెంట్ సెక్షన్‌లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న నేరస్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి.

 

ఇకపోతే, ఈ వీడియో @KreatelyMedia హ్యాండిల్‌తో Xలో పోస్ట్ చేయబడింది. ట్రక్కులో పెట్రోల్ లేదని తన పోస్ట్ క్యాప్షన్‌లో రాశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 5.5 లక్షలకు పైగా వీక్షించారు. కాగా ఈ పోస్ట్‌ను 11 వేల మందికి పైగా వినియోగదారులు లైక్ చేశారు. ఈ ఘటనపై కామెంట్ సెక్షన్‌లో వందలాది మంది స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..