బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్‌..! ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు చూపించింది..

|

Apr 25, 2024 | 6:06 PM

అందిన సమాచారం ప్రకారం, మహిళ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలని తెలిసింది. హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తోంది. దాంతో పోలీసులు ఆమెను అడ్డుకుని చలాన్ విధించారు. తనకు జరిమానా వేశారని, ఆ చలాన్‌ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని భావించిన ఆ మహిళ వెంటనే ఒక డ్రామా మొదలుపెట్టింది. ఆ డ్రామాతో చాలా సేపు అక్కడ రచ్చ రచ్చ చేసింది.

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్‌..! ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు చూపించింది..
Madhya Pradesh Traffic Poli
Follow us on

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పోలీసులు నిర్వహిస్తున్న హెల్మెట్ చెకింగ్ ప్రచారంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. విజయనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు పట్టుకుంటున్నారు. హెల్మెట్ ధరించలేదని ఓ మహిళను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఒక్కసారిగా హై వోల్టేజ్‌ డ్రామా మొదలైంది. సదరు మహిళపై పోలీసు అధికారి చలాన్ విధించడంతో ఆమె సహనం కోల్పోయి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. సడెన్‌గా ఆమె పెద్ద గొంతుతో బిగ్గరగా అరుస్తుంది. ఆ వెంటనే ఆమె బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. ఒకసారి ఓ పోలీసు అధికారి వద్దకు వెళ్తుంది. మరోసారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుల వద్దకు వెళ్లి ఏడుస్తుంది. ఈ హైవోల్టేజీ డ్రామా చూసి జనాలు కూడా షాక్ అయ్యారు. అక్కడి పరిస్థితి ఏదో తేడాగా అనిపించి సదరు పోలీసు అధికారి తనను తాను రక్షించుకోవడం సముచితమని భావించాడు. వెంటనే ఆమెకు చేతులేత్తి దండంపెట్టి పంపించేశాడు. ఈ హంగామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందిన సమాచారం ప్రకారం, మహిళ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలని తెలిసింది. హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తోంది. దాంతో పోలీసులు ఆమెను అడ్డుకుని చలాన్ విధించారు. తనకు జరిమానా వేశారని, ఆ చలాన్‌ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని భావించిన ఆ మహిళ వెంటనే ఒక డ్రామా మొదలుపెట్టింది. ఆ డ్రామాతో చాలా సేపు అక్కడ రచ్చ రచ్చ చేసింది. పోలీసులు మహిళను ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె అంగీకరించడానికి సిద్ధంగా లేదు. బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. ఓ మహిళా పోలీసు కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. అరుస్తూ ఏడుస్తున్న మహిళను శాంతింపజేయడానికి ఆమె కూడా తన శాయశక్తులా ప్రయత్నించింది. కాని హై వోల్టేజ్ డ్రామాను ఆపేందుకు ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో పోలీసులే దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విసుగెత్తిపోయి విధుల్లో ఉన్న పోలీసు అధికారి సదరు మహిళ ముందు చేతులు జోడించాడు. మేడమ్, నేను చేతులు జోడించి అడుగుతున్నా దయచేసి నన్ను క్షమించి మీరు వెళ్ళండి.. అంటూ వేడుకున్నారు.

ఇవి కూడా చదవండి

విజయనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రతీక్ష మార్కో తెలిపిన వివరాల ప్రకారం, జబల్‌పూర్‌లోని విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీనదయాళ్ కూడలిలో ఈ సంఘటన నమోదైంది. స్థానిక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ వీడియో దాదాపు 10 రోజుల క్రితం జరిగినట్టుగా తెలిసింది.

ఇదిలా ఉంటే, విజయనగరం పోలీస్ స్టేషన్ వివక్ష చూపుతోందని మహిళ ఆరోపించింది. చాలా మంది సీటు బెల్టు పెట్టుకోకుండానే ప్రయాణిస్తుంటే పోలీసులు చూస్తూ నిలబడుతున్నారని ఆరోపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..