ఒక దంపతులు తమ బిడ్డతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని రోడ్డుపక్కనకు పిలిచారు. అయితే, బైక్‌పై వెళ్తున్న ఆ దంపతులిద్దరూ హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. అయినప్పటికీ వారిని అడ్డుకున్న పోలీసులు.. బైక్‌ను రోడ్డు పక్కన ఆపి వార్నింగ్ ఇచ్చారు.. ఇద్దరూ హెల్మెట్‌ఉ పెట్టుకున్నారు. బైక్ స్పీడ్ కూడా నార్మల్‌గానే ఉంది.. హెల్మెట్ ధరించి సాధారణ వేగంతో వెళ్తున్న దంపతులు చేసిన తప్పేంటి..? అని అందరూ అనుకోవచ్చు. కానీ, ట్రాఫిక్ పోలీసులు చేసిన ఈ పని అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ వీడియోను మల్లికార్జున్ ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ దంపతులు చేసిన తప్పేంటి..?
సిగ్నల్ పాయింట్ వద్ద వాహనదారులను చెక్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఒక బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డుకున్నారు. రోడ్డుపక్కన బైక్‌ను పార్క్ చేసిన దంపతులతో సీనియర్ ట్రాఫిక్ పోలీస్ మాట్లాడుతూ.. మిత్రులారా.. మీరు పొరపాటు చేశారు. మీ పిల్లాది వయస్సు ఎంత.?అని అడిగారు.. అందుకు ఆ దంపతులు 3 సంవత్సరాలని చెప్పారు. 9 నెలల నుంచి 4 సంవత్సరాల పిల్లలను బైక్ ముందు కూర్చోబెట్టకూడదు..అలా కూర్చొబెడితే తప్పే అవుతుందన్నారు. వారిని వెనుక కూర్చున్న వారు పట్టుకోవాలి. లేదంటే, సేఫ్టీ బ్యాగ్ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ రూల్ తప్పక తెలుసుకోవాలని కోరారు పోలీసులు.
నిబంధనల ప్రకారం బైక్‌పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. దయచేసి సురక్షితంగా ఉండండి. లేని పక్షంలో మీరు బ్రేకులు వేసినప్పుడు పిల్లాడు బోల్తా పడే అవకాశం ఉంది అని చెప్పారు.
అచ్చమైన కన్నడలో కూల్‌గా, గౌరవంగా మాట్లాడిన పోలీస్ అధికారిని నెటిజన్లు అభినందిస్తున్నారు. మీలాంటి ట్రాఫిక్ పోలీసులు ఉంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు పోయే ప్రమాదాలు ఉండవని అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. మీలాంటి వాళ్ల వల్లే పోలీసులంటే గౌరవం పెరిగిందని మరొకరు అన్నారు. మరో యూజర్ స్పందిస్తూ.. మంగుళూరులో అత్యుత్తమ ట్రాఫిక్ పోలీస్ మీరే అంటూ ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..