సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ట్రాఫిక్ పోలీసు లంచం తీసుకున్న విధానం చూస్తే మీరే షాక్ అవుతారు. ఎవ్వరికీ తెలియకుండా లంచం ఇట్లా తీసుకోవాలి బాసూ..! అని మీరు అనక మానరు.
చూశారా.! ఎవ్వరికీ తెలియకుండా అక్క ఎట్లా లంచం తీసుకుంటోందో.! అసలే శాంతి భద్రతలు కాపాడే ఆఫీసర్లం… కనిపించే మూడు సింహాలు.. దేనికో దేనికో దేనికో ప్రతిరూపాలయితే కనిపించని ఆ నాలుగో సింహమేరా.. ఇవన్నీ పైపైన ఆ అక్క చెప్పే డైలాగులు.. కానీ తీరా చూస్తే చేసే పనులు ఇట్లానే ఉంటాయి. అయితే పైనొకడు ఉంటాడు. అన్నీ చూస్తుంటాడు.. దీన్ని కూడా ఎవడో దూరం నుంచి చూశాడు.. నెట్టింట ఎక్కించాడు. దెబ్బకు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ.. ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓ సారి లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.