Viral Video: స్పైడర్ మ్యాన్‌లా వచ్చి చిన్నారి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. సెల్యూట్ సర్

|

Jun 13, 2022 | 1:28 PM

వైరల్ అవుతున్న వీడియోలో.. ఎలక్ట్రిక్ రిక్షా నుండి హఠాత్తుగా ఓ బాలుడు పడిపోయాడు.. వెంటనే అక్కడ ఉన్న పోలీసు స్పందించి.. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ.. చిన్నారి బాలుడి దగ్గరకు పెరిగెట్టుకుని వెళ్లి... బాలుడిని రోడ్డుమీద నుంచి తీసుకుని ఎత్తుకున్నాడు.

Viral Video: స్పైడర్ మ్యాన్‌లా వచ్చి చిన్నారి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. సెల్యూట్ సర్
Traffic Cop Saves Child
Follow us on

Viral Video: ఓ ట్రాఫిక్ పోలీస్ ఓ చిన్నారి ప్రాణాలను కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.  ఈ వీడియోను అవనీష్ శరణ్ (Avanish Sharan) ఆదివారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు.. ఒక ఎలక్ట్రిక్ రిక్షా  ఒక బాలుడు పడిపోయాడు..అయితే రెప్ప పాటులో పోలీసు స్పందించి.. బాలుడి ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో 6 లక్షలకు పైగా వ్యూస్, 41,000 లైక్‌లను సొంతం చేసుకుంది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. ఎలక్ట్రిక్ రిక్షా నుండి హఠాత్తుగా ఓ బాలుడు పడిపోయాడు.. వెంటనే అక్కడ ఉన్న పోలీసు స్పందించి.. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ.. చిన్నారి బాలుడి దగ్గరకు పెరిగెట్టుకుని వెళ్లి… బాలుడిని రోడ్డుమీద నుంచి తీసుకుని ఎత్తుకున్నాడు. ఇది జరుగుతున్న సమయంలో అటుగా ఓ బస్సు వస్తుంది.. అయితే ఆ బస్సు డ్రైవర్ కూడా చాకచక్యం ప్రదర్శించి.. సడెన్ బ్రేక్ వేసి.. బస్సుని ఆపాడు. దీంతో అక్కడ జరగాల్సిన పెను ప్రమాదం నివారింపబడింది. ఆ చిన్నారి బాలుడు సురక్షితంగా తల్లి ఒడికి చేరుకున్నాడు. అయితే తన బాలుడు పడిపోయిన వెంటనే తల్లి రిక్షామీద నుంచి కిందకు దిగి.. హడవిడిగా బాలుడి వద్దకు పరిగెత్తుకుని వచ్చింది.

ఇవి కూడా చదవండి

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలోని ట్రాఫిక్ పోలీసు ధైర్యసాహసాలను, డ్రైవర్ సమయ స్ఫూర్తిని కొనియాడుతున్నారు. అయితే కొందరు రిక్షా డ్రైవర్‌ డ్రైవింగ్ తీసురుని నిరసిస్తున్నారు. “పోలీసు అధికారుల అప్రమత్తత, బస్సు డ్రైవర్ సత్వర స్పందనను అభినందిస్తున్నారు. అదే సమయంలో.. రోడ్డు లేన్ విభజించిన తీరు బాగాలేదని.. తప్పనిసరిగా ఈ అధికారులకు జరిమానా విధించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. బస్సు సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు వెనుక ఉన్నవారు గాయపడితే ఏమి చేయాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి బస్సు డ్రైవర్ తెలివిగా వ్యవహరించాడు. ట్రాఫిక్ పోలీసు ధైర్యానికి తెలివికి సలాం అంటున్నారు. అతని వంటి నిస్వార్థపరుల వల్లే మానవత్వం ఇంకా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం,పోలీసు శాఖ అతనికి తగిన ప్రతిఫలమిస్తుందని ఆశిస్తున్నానంటూ అతడిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటూ రకరకాల కామెంట్స్ తో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..