World War III: 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా? టైమ్ ట్రావెలర్ చెప్పిన మాటలు వింటే వెన్నులో వణుకే

|

Dec 02, 2022 | 9:20 AM

మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా? వస్తే ఎలా ఉంటుంది? వినాశమేనా? తాజాగా సోషల్‌ మీడియాలో టైమ్‌ ట్రావెలర్లు చెబుతున్నదేంటి?

World War III: 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా? టైమ్ ట్రావెలర్ చెప్పిన మాటలు వింటే వెన్నులో వణుకే
World War 3
Follow us on

మీరు టైమ్ ట్రావెల్‌ని నమ్ముతారా? ఆదిత్య 369లో లాగా.. భూత, భవిష్యత్ కాలాల్లోకి వెళ్లొచ్చని భావిస్తున్నారా? ఐతే.. మీ అభిప్రాయం కరెక్టే అంటున్నారు టైమ్ ట్రావెలర్లుగా చెప్పుకుంటున్నవారు. ఇలాంటి వారు తాము భవిష్యత్తు నుంచి వర్తమాన కాలానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ లిస్టులో తాజాగా మరో వ్యక్తి చేరాడు. మిగతావారి లాగానే ఇతను కూడా టిక్ టాక్ ద్వారా తనను పరిచయం చేసుకున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటూ.. దానికి సంబంధించిన ఫొటోలను టిక్ టాక్ వీడియోలో చూపించిన అతను.. ఆ యుద్ధం వల్ల మనుషులు.. భూమిని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది అన్నాడు. ఇతను భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అంటూ.. పెట్టే వీడియోలను వేల మంది చూస్తున్నారు.

ఇక తాను భవిష్యత్తులో ఉన్నానన్న ఆ టిక్‌టాక్ యూజర్.. భవిష్యత్తు నుంచి గతంలో వీడియోలు పోస్ట్ చేసే వీలు ఉందని తెలిపాడు. తాను టిక్ టాక్‌లో ఆ విధంగానే పోస్ట్ చేస్తున్నానని వివరించాడు. తనను మూడో ప్రపంచ యుద్ధం గురించి ఎక్కువ మంది అడుగుతున్నారన్న ఆ యూజర్.. మూడో ప్రపంచ యుద్ధం ఎలా మొదలైందో, ఎలా ముగిసిందో చూడండి అంటూ ఫొటోలు షేర్ చేశాడు. మొదటి ఫొటోలో ఓ నగరంపై భారీ పేలుడు ఉంది. బలమైన, బూడిదరంగు మేఘాలతో ఉంది. ఇంకో ఫొటోలో పూర్తిగా నాశనం అయిపోయిన భూమిని అంతరిక్షం నుంచి చూపిస్తున్నట్లు ఉంది.

వీటిపై టిక్ టాక్ యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అణు యుద్ధం జరిగి ప్రపంచం నాశనం అవుతుందని నమ్ముతున్నారు. ఇంకొందరు చూడటానికి భయంకరంగా ఉన్నాయి, మనం చనిపోతామా అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి