చేతిలో స్మార్ట్ ఉండి ఇంటర్ నెట్ సదుపాయం ఉండేలే గానీ, సోషల్ మీడియా వినియోగదారులకు వినోదానికి లోటు లేదు. ప్రతి రోజూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో మనుషులు చేసే వింత వింత పనులు, జంతువుల, పక్షులు, పాములకు సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్‌నెట్‌లో కనిపిస్తాయి. ఇక అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో షేర్ అవుతుంటాయి. వీటిలో భయానక పులి వీడియోలు మాత్రమే కాకుండా, కొన్ని మైండ్ బ్లోయింగ్ వీడియోలు కూడా ఉన్నాయి. ఒకేసారి భిన్న రకాల అనుభవాలను అందించే వీడియోలు కూడా వైరల్ అవుతాయి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో పులి, నెమలికి సంబంధించినది,. ఈ వీడియోలో ఒక నెమలి చుట్టునిలబడి ఉన్న పిల్లల మధ్య నెమలి డ్యాన్స్ చేస్తోంది. ఇతర నెమళ్లు ఉల్లాసంగా తిరుగుతూ ఆనందిస్తుండగా, నృత్యం చేస్తున్న నెమలిని వేటాడేందుకు వెనుక నుంచి అప్పుడే వచ్చింది ఒక పెద్ద పులి. నెమలి పురి విప్పి ఆనందంగా డ్యాన్స్ చేస్తుండగా, వెనుక నుండి వచ్చిన పులి వేగంగా ఆ నెమలిని ఎటాక్ చేస్తుంది. నెమలిపై దాడి చేయడానికి పంజా పంజా విసురుతూ అమాంతంగా ఎగురుతుంది. అంతలోనే నెమలి తన చాకచక్యంతో అమాంతంగా గాల్లోకి ఎగురుతూ చెట్టు కొమ్మ మీద ఎక్కి కూర్చుంటుంది. నెమలి పిల్లలు సైతం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పులి ఉన్న ప్రదేశం నుండి తలోదిక్కుక్కు పారిపోతాయి. ఇక చివర్లో నెమలి అందంగా డ్యాన్స్ చేస్తుండటం, మరోవైపు పులి తన బిడ్డలను పాలిస్తున్న దృశ్యాలు ఎంతో అద్భుతంగా కనిపించాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ దృశ్యాలకు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియో చూడండి..
ఈ వీడియో rawrszn అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. పులి వేట నుండి నెమలి నేర్పుగా తప్పించుకున్న ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోకు ఇప్పటికే లక్షలాది లైక్‌లు, వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా మరోమారు తెరమీదకు వచ్చి విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..