దారి తప్పిన ఓ పెద్దపులి అడవి నుంచి బయటకు రావడంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. దాంతో ఒక్కసారిగా అక్కడివారంతా కలిసి దానిపై ముక్కుమ్మడి దాడి చేశారు.. దాంతో ఆ పెద్దపులి కంటి చూపును కోల్పోయింది. ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోది. పులి పరిస్థితి ఎలా ఉంటుందోనని పశువైద్యులు, అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా ఎక్కడ జరిగింది.. ఏం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే…
పెద్దపుల్లిని చావుకు దగ్గర చేసిన ఈ షాకింగ్ ఘటన అస్సాంకి సంబంధించినదిగా తెలిసింది. అస్సాంలోని నాగావ్ జిల్లా కామాఖ్య రిజర్వ్ ఫారెస్ట్ నుండి ఒక పెద్ద పులి బయటకు వచ్చి గ్రామంలోకి ప్రవేశించింది. అది మూడేళ్ల రాయల్ బెంగాల్ టైగర్‌గా అని తెలిసింది. పులిని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా పులిపై దాడి చేశారు. ఈ దాడిలో పులి తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు పులిపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో అది వారి నుంచి తప్పించుకునేందుకు నదిలోకి దూకింది.
అయితే, 17 గంటల తర్వాత అటవీ సిబ్బంది దానిని రక్షించారు. అత్యవసర పరిస్థితిలో పులిని చికిత్స కోసం కాజిరంగాలోని వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రానికి తరలించారు. పులి రెండు కళ్లు బాగా దెబ్బతిన్నాయని సీడబ్ల్యూఆర్‌సీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ భాస్కర్ చౌదరి తెలిపారు. ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తలపై, అంతర్గత అవయవాలపై కూడా గాయాలయ్యాయి. కంటి గాయాలు మెరుగుపడకపోతే, జంతువును తిరిగి అడవిలోకి వదలడం అసాధ్యమని డాక్టర్ చౌదరి చెప్పారు.
#WildAngle
What tragic consequences of fear and misunderstanding. A tigress in #Kamakhya Reserve Forest in #Assam that was called #gentlegiant by some villagers was brutally attacked by people as the tigress stayed put in the area, possibly sparking fears. The attack has left… pic.twitter.com/S8AST4Vjdd— Virat A Singh (@tweetsvirat) November 22, 2024
ఇదిలా ఉంటే, పులిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పులిపై దాడి చేసిన వారిలో 9 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. జూలైలో వరదలు వచ్చినప్పటి నుండి వన్యప్రాణులు నిరంతరం గ్రామీణ ప్రాంతాల వైపు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పులిని చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారని, ప్రాణాలను రక్షించుకోవటం కోసమే పులిపై దాడిచేసినట్టుగా చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..