Viral Video: అరణ్యంలో రెండు పులుల మధ్య భీకర పోరాటం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

|

Feb 18, 2022 | 8:51 AM

Tigers Viral Video: అడవి ప్రపంచంలో అనునిత్యం రక్తపాతం కొనసాగుతూనే ఉంటుంది. చిన్న జీవులను.. పెద్ద జీవులు.. పెద్ద జీవులను.. క్రూర జంతువులు వేటాడుతుంటాయి.

Viral Video: అరణ్యంలో రెండు పులుల మధ్య భీకర పోరాటం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..
Tigers
Follow us on

Tigers Viral Video: అడవి ప్రపంచంలో అనునిత్యం రక్తపాతం కొనసాగుతూనే ఉంటుంది. చిన్న జీవులను.. పెద్ద జీవులు.. పెద్ద జీవులను.. క్రూర జంతువులు వేటాడుతుంటాయి. అరణ్యంలో బలహీన జంతువులపై క్రూరమృగాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. అయితే.. మీరు నేషనల్ పార్క్‌లో చాలా పులులను చూసి ఉండాలి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే రెండు పులుల మధ్య పోరాటాన్ని దగ్గరగా చూసుంటారు. ఎంపీ సియోని ప్రియదర్శన్ పెంచ్ నేషనల్ పార్క్‌ (seoni national park) లో ఇలాంటి దృశ్యం కనిపించింది. సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో రెండు పులుల మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. వాస్తవానికి సఫారీ సమయంలో.. పర్యాటకులు పెంచ్ టైగర్ రిజర్వ్ లోపల రోడ్డుపై రెండు పులుల భీకర పోరాటాన్ని దగ్గర చూడటంతోపాటు కెమెరాల్లో బంధీంచారు. అయితే.. ఈ భీకర పోరాటంలో పులుల గర్జన పర్యాటకులను వణికించేలా చేసింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. రెండు పులులు ఎదురెదురుగా నిలబడి ఉండడాన్ని మీరు చూడవచ్చు. రెండు కూడా చాలా కోపంగా చూసుకుంటున్నాయి. ఈ క్రమంలో క్షణాల్లోనే అకస్మాత్తుగా రెండూ కూడా ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. అనంతరం భీకరంగా పోట్లాడుకున్నాయి. రెండు పులుల పోరులోని ఈ భయానక దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా ఒళ్లుఝలదరిస్తుంది. ఈ పోరాటం చాలాసేపటి వరకు కొనసాగుతుంది. అయితే.. అక్కడే కొంత దూరంలో సఫారీకి వెళ్లిన టూరిస్టుల కార్లు ఉండటాన్ని కూడా చూడవచ్చు. అత్యంత భయంకరమైన ఈ దృశ్యాన్ని పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.

వైరల్ వీడియో..


పులుల భీకర పోరును చూసి పర్యాటకులు సైతం భయపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రజలు ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సియోనిలోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన జరిగింది. ఇక్కడికి దేశంలోని నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.

Also Read:

Viral Video : సంగీతానికి మూగజీవులు కూడా పరవశించాల్సిందే.. అందుకు సాక్షం ఈ వీడియోనే..

Viral Video: ‘అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినాదిరో’.. పెళ్లికూతురుని అలా చూసిన పెళ్లికొడుకు రియాక్షన్‌..