
సోషల్ మీడియా క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే, ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ తయారు చేస్తున్నారు. అలాంటి ఒక వైరల్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ పై నిలబడి రైలు వచ్చే వరకు వేచి ఉన్నారు. రైలు దగ్గరకు రాగానే, వారు ఒక్కొక్కరుగా కింద ఉన్న నదిలోకి దూకుతారు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా, షాక్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం ఆలస్యం జరిగినా వాళ్ల జీవితం ముగిసిపోయేది. ఈ వీడియోను @Sparkes_hub ద్వారా Xలో షేర్ చేశారు. కాగా, ఇది మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
వైరల్ వీడియోలో రైలు ఒక నదిపై ఉన్న వంతెనపై నడుస్తోంది. కింద నది ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై ముగ్గురు యువకులు ట్రాక్‌ల మీద నిలబడి ఉన్నారు. వారిలో ఒకరి చేతిలో ఫోన్ ఉంది. బహుశా వారు రీల్ తయారు చేస్తున్నట్టుగా ఉంది.. అంతలెపూ రైలు హారన్ కొడుతూ వస్తుంది. దాంతో మొదటగా నిలబడిన అబ్బాయి దూకుతాడు. తర్వాత మిగతా ఇద్దరు కూడా దూకేశారు. దూకే సమయం సరిగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. రైలు కొంచెం వేగంగా వెళ్లి ఉంటే లేదా వారు ఏమాత్రం అదుపు తప్పినా కూడా పెను ప్రమాదం జరిగి ఉండేది.
వీడియో ఇక్కడ చూడండి..
😳 देश के युवा एक छोटी इंस्टाग्राम रील 🎥 बनाने के लिए इतना गिर गए हैं!
😱 ट्रेन सिर्फ कुछ सेकंड की देरी से गुजरी! 🚂
इन लोगों के बारे में आपका क्या कहना है? 🤔 pic.twitter.com/9exu4LfyWy
— Spark Hub (@Sparkes_hub) August 29, 2025
తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ఈ వీడియో వేగంగా చర్చనీయాంశంగా మారుతోంది. సోషల్ మీడియాలో వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆ ముగ్గురు యవకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకి వాళ్ళ ప్రాణాల గురించి పట్టింపు లేదు, వాళ్ళు రీల్స్ కోసం పిచ్చివాళ్ళయ్యారంటూ పలువురు మండిపడ్డారు. ఇక్కడ రైలు ఆలస్యంగా రాలేదు, యమరాజు ఆలస్యం చేసాడు అంటూ మరికొందరు వ్యాఖ్యనించారు. పిల్లలు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటూ మరికొందరు ప్రశ్నించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..