Viral Video: ఆపరేషన్ థియేటర్ లో ఇదేం పని సిస్టర్స్‌..! రీల్స్‌కు తగ్గ మూల్యం దక్కిందిగా.. వీడియో వైరల్‌..

|

Feb 29, 2024 | 3:48 PM

ఆ తర్వాత ఇదే పెద్ద వివాదంగా మారింది. ఆస్పత్రిలో సిబ్బంది ఇలాంటి పనులు చేయకూడదని ఓ వర్గం ముందుకు వచ్చింది. ఆపరేషన్ థియేటర్ లోపల డ్యాన్స్ చేయడం పట్ల అన్ని విభాగాల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఎమర్జెన్సీ కేసులు లేనప్పుడు ఆసుపత్రిలో ఇలాంటి పనులు చేయడంలో తప్పేమీ లేదని, రోగులకు కూడా కొంత ఉపశమనం కలుగుతుందన్న వాదనను పంచుకున్నారు కొందరు నెటిజన్లు.

Viral Video: ఆపరేషన్ థియేటర్ లో ఇదేం పని సిస్టర్స్‌..! రీల్స్‌కు తగ్గ మూల్యం దక్కిందిగా.. వీడియో వైరల్‌..
Nurses Dance Reels
Follow us on

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రాజ్యమేలుతున్న సమయాలు ఇవి. ప్రస్తుత రోజుల్లో వీడియోలు, రీల్‌లను పెద్ద సంఖ్యలో ప్రజలు వినోదంగా ఆస్వాదిస్తున్నారు. చాలా మంది విభిన్న విషయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా మేకర్స్ కంటెంట్ల క్రియేట్‌ చేయటం కోసం ఎలాంటి పనులైనా చేస్తున్నారు. కొందరు బాధ్యత గల వృత్తిలో ఉండి కూడా తమ పనిని, పని చేసే ప్రదేశంలో ఇలాంటి రీల్స్‌, వీడియోలు చేస్తూ సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నిస్తారు. కానీ, అలాంటివి చేసే క్రమంలో అనేక వీడియోలు, కంటెంట్‌లు వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా మారటం కూడా తరచూ చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ముగ్గురు నర్సులు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేశారు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అంతే ఆ ముగ్గురు నర్సులను విధుల నుంచి తొలగించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అయ్యో పాపం.. నర్సులు డ్యాన్స్ చేయకూడదా అనే సందేహం రావొచ్చు మీకు.. చెయొచ్చు.. కానీ, వారు డ్యాన్స్‌ చేస్తూ హంగామా చేసింది ఎక్కడో కాదు.. రోగుల ప్రాణాలను కాపాడే దేవాలయం లాంటి ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌లో. ఏకంగా ఆపరేషన్‌ థియేటర్‌లోనే ముగ్గురు నర్సులు కలిసి డ్యాన్స్ చేయటమే కాకుండా, ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేయటంతో పెద్ద ఎత్తున నెటిజన్లు విమర్శలు చేయటం మొదలు పెట్టారు. దీంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వివాదాస్పదంగా మారడంతో స్టాఫ్ నర్సులు పుష్పా సాహు, తృప్తి దాసర్, తేజ్ కుమారిలను ఉద్యోగాల నుంచి తొలగించారు. గత 5వ తేదీన ఆసుపత్రిలోని ‘బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ యూనిట్’ ఆపరేషన్ థియేటర్‌లో డ్యాన్స్ రీళ్లు తీసుకున్నట్టుగా తెలిసింది.

ఆ తర్వాత ఇదే పెద్ద వివాదంగా మారింది. ఆస్పత్రిలో సిబ్బంది ఇలాంటి పనులు చేయకూడదని ఓ వర్గం ముందుకు వచ్చింది. ఆపరేషన్ థియేటర్ లోపల డ్యాన్స్ చేయడం పట్ల అన్ని విభాగాల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఎమర్జెన్సీ కేసులు లేనప్పుడు ఆసుపత్రిలో ఇలాంటి పనులు చేయడంలో తప్పేమీ లేదని, రోగులకు కూడా కొంత ఉపశమనం కలుగుతుందన్న వాదనను పంచుకున్నారు కొందరు నెటిజన్లు.

ఏది ఏమైనా ఈ వీడియో వైరల్‌గా మారడం, చర్చనీయాంశం కావడంతో ఆసుపత్రి అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో రీళ్లు వేసినందుకు ముగ్గురు కాంట్రాక్ట్‌ నర్సులను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..