Viral Video: అట్లుంటది నాతో ముచ్చట..! బంతితో రప్ఫాడించిన కుక్క పిల్ల.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

|

Jun 22, 2022 | 7:19 AM

కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి.. ఎవరైనా వాటికి హాని తలపెడితే.. అవి కూడా హాని తలపెడతాయి. ప్రేమతో ఉంటే.. అంతే ప్రేమను కనబరుస్తాయి. అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెడతాయి.

Viral Video: అట్లుంటది నాతో ముచ్చట..! బంతితో రప్ఫాడించిన కుక్క పిల్ల.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Viral Video
Follow us on

Dog playing volleyball: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే.. తాజాగా ఓ కక్క పిల్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పగ్ వాలీబాల్ ఆడుతున్న దృశ్యం చూసి సోషల్ మీడియా నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు. సాధారణంగా కుక్కలు చాలా తెలివైన జంతువులు. కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి.. ఎవరైనా వాటికి హాని తలపెడితే.. అవి కూడా హాని తలపెడతాయి. ప్రేమతో ఉంటే.. అంతే ప్రేమను కనబరుస్తాయి. అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెడతాయి. అందుకోసమే చాలామంది వాటిని పెంచుకుంటారు. అయితే.. కుక్కలతో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. కానీ.. ఇక్కడ ఒక కుక్క పిల్ల తెగ హల్ చల్ చేస్తోంది. దానికదే వాలీబాల్ ఆడుతూ.. అందర్ని అవాక్కయ్యేలా చేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో పగ్ జాతికి చెందిన కుక్కపిల్ల.. రోడ్డు పక్కన ఒక్కటే వాలీబాల్ ఆడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. అది బెలూన్‌ను పైకి తలతో నెడుతూ.. పల్టీలు కొడుతూ కనిపిస్తుంది. ఇలా చాలాసార్లు కుక్క పిల్ల బెలూన్‌ను గాలిలోకి పుష్‌ చేస్తూ కనిపిస్తుంది. వీడియో చివరి వరకు బంతిని కింద పడకుండా కుక్కపిల్ల ఎలా పుష్ చేస్తోందో వీడియోలో చూడవచ్చు.

వైరల్ వీడియో..

ఇవి కూడా చదవండి

కుక్క పిల్ల వాలీబాల్ ఆడుతున్న ప్రదేశం పార్కులా కనిపిస్తుంది. అయితే.. దానికి ట్రైనింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఏదీఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..