Optical Illusion: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. మీరు మొదటిగా చూసేదే మీ మనస్తత్వం!
ప్రతీ ఒక్కరిది స్వభావం ఒకేలా ఉండదు. ఒకరి ఆలోచనకు.. మరొకరి ఆలోచనకు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువు లేదా చిత్రాన్ని...
ప్రతీ ఒక్కరిది స్వభావం ఒకేలా ఉండదు. ఒకరి ఆలోచనకు.. మరొకరి ఆలోచనకు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువు లేదా చిత్రాన్ని ఇద్దరు వ్యక్తులకు చూపిస్తే.. వారు దాన్ని చూసే దృక్కోణం వేర్వేరుగా ఉంటుంది. అలాగే దానిపై వారిద్దరి ఆలోచనలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఇక ఆ ఆలోచనలే వారి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని బయటపెడతాయి. ఇలా ఒకరి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని బయటపెట్టడానికి సైకాలజిస్టులు ఆప్టికల్ ఇల్యూషన్ టెస్టును చేస్తుంటారు. ఇక ఆప్టికల్ ఇల్యూషన్స్ మీ ఆలోచనా ధోరణి, మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో మొదట మీరు ఏం చూస్తారో దాని బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చు.
1.వృద్ధుడి ముఖం:
మొదటిగా మీకు వృద్దుడి ముఖం కనిపించినట్లయితే.. మీ చూపు ఎప్పుడూ నిర్దేశించిన లక్ష్యాన్ని దాటిపోదు. అలాగే మీ మనస్తత్వం విషయానికొస్తే.. ట్రూ లవ్ మీకు దొరుకుతుంది. నిజంగా ప్రేమకు సమయాన్ని, శక్తిని వెచ్చించేవారి పట్ల మీరు ఆకర్షితులవుతారు.
2. గుర్రంపై వ్యక్తి:
మీ చూపు మొదటిగా గుర్రంపై ఉన్న వ్యక్తిపై పడినట్లయితే.. మీరు కలలు కనే వ్యక్తి మీకు ఎదురుగా ఉన్నా.. వారికి దగ్గరయ్యేందుకు మీ మనసు సంకోచిస్తున్నట్లు అర్ధం. ప్రేమ, రొమాన్స్ లాంటి వాటికి మీ మనసు ఇంకా సిద్దంగా లేనట్లు లెక్క.
3. అమ్మాయి:
మీ చూపు ఆప్టికల్ ఇల్యూషన్‌లో ఉన్న అమ్మాయిపై పడినట్లయితే.. మిమ్మల్ని ఫస్ట్ లవ్ జ్ఞాపకాలు ఇంకా బాధిస్తున్నాయని అర్ధం. నిజమైన ప్రేమ అసలు ఉంటుందా.? అనే ఆలోచన మిమ్మల్ని సతమతమయ్యేలా చేస్తుంది.
4. ఆర్చ్:
మీ చూపు మొదటిగా నదిపై ఉన్న ఆర్చ్ మీద పడినట్లయితే.. మీకు సాహసోపేత పనులు చేయాలని తహతహలాడుతుంటారు. ప్రేమలో ఇట్టే పడిపోతారు. ప్రతీ విషయంలోనూ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఫీల్ అవుతారు.