ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఈ మధ్యకాలంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. చూడటానికి అవి ఈజీగానే ఉన్నప్పటికీ.. వాటిల్లో ఉండే రహస్యాన్ని కనిపెట్టాలంటే.. మీ బుర్రకు పదునుండాల్సిందే. ఇలాంటి ఫోటోలకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే.. ఇవి మీ కంటికి పరీక్ష పెట్టడమే కాదు.. మెదడుకు మేత కూడా వేస్తుంటాయి. ఈ ఫోటో పజిల్స్‌ను మీరు సాల్వ్ చేస్తే.. మీ ఆలోచనా శక్తి పెరగడంతో పాటు.. చురుకుదనం కూడా ఉంటుంది. వీకెండ్ బుక్స్‌లో వచ్చే పిక్చర్ పజిల్స్, సుడోకోలు ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మరో ఎత్తు. ఆ కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో మీరెక్కడ చూసిన ‘o’ అక్షరాన్ని చూడవచ్చు. అందులో ‘c’ అక్షరం కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అది కూడా 15 సెకన్లలో గుర్తించాలి. ఇలా గుర్తుపడితే మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే.. మీరు మేధావులన్నట్లే. మరి లేట్ ఎందుకు మీ ఐ పవర్ టెస్ట్ చేయండి.. ఓసారి ట్రై చేయండి.. ఎంత వెతికినా మీకు సమాధానం దొరక్కపోతే.. కింద ఫోటో క్లిక్ చేయండి.
here is the answer pic.twitter.com/822zIMzC2y
ఇవి కూడా చదవండి— telugufunworld (@telugufunworld) August 18, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..