Viral Video: అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏం జరుగుతుందో తెలుసా?.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు..!

|

Apr 28, 2022 | 9:58 PM

Viral Video: సాధారణంగా దుస్తులు ఉతికిన తరువాత త్వరగా ఆరటానికి నీటిని పిండుతారనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కోసారి మనం వినియోగించే టవర్ తడిగా ఉంటే..

Viral Video: అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏం జరుగుతుందో తెలుసా?.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు..!
Space
Follow us on

Viral Video: సాధారణంగా దుస్తులు ఉతికిన తరువాత త్వరగా ఆరటానికి నీటిని పిండుతారనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కోసారి మనం వినియోగించే టవర్ తడిగా ఉంటే కూడా నీటిని తీసేందుకు పిండటం చేస్తుంటాం. అలా చేయడం ద్వారా ఆ నీరు కింద పడిపోతుంది. భూమిపై అయితే నీరు కింద పడిపోతుంది.. మరి అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏం జరుగుతుందో తెలుసా? పోనీ దానికి ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మీరు చూడకపోయినా.. ఆ విధంగా ఆలోచించకపోయిన ఇప్పుడు తెలుసుకోండి.

తాజాగా సోషల్ మీడియాలో స్పేస్ సెంటర్‌లో ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఓ ఆస్ట్రోనాల్ తడి టవల్‌ను చూపిస్తే ఏం జరుగుతుందో చూడంటూ అంటూ ప్రయోగం చేసి చూపాడు. తడిగా ఉన్న టవల్‌ను పిండేసే ప్రయత్నం చేశాడు. అయితే, టవల్‌తో ఉన్న వాటర్ కిందపడిపోకుండా.. టవల్ చుట్టూ ఒక ట్యూబ్ మాదిరిగా ఏర్పడింది. ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా వేరుపడకుండా, కింద పడకుండా టవల్ చూట్టు ఒక పొర మాదిరిగా ఏర్పడింది.

అయితే, దీనంతటికీ కారణం గురుత్వారక్షణ శక్తి. అవును.. భూమిపై గురుత్వాకర్షణ శక్తి కారణంగా టవల్ నీరు పిండితే.. ఆ నీరు కింద పడిపోతుంది. అంతరిక్షంలో వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి.. ఆ నీరు టవల్ చుట్టూ ఒక పైప్ మాదిరిగా ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోను ‘కెనడియన్ నాసా ఏజెన్సీ’ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది.

Also read:

Optical Illusion: ఈ ఫోటోలో అద్భుత రహస్యం దాగుంది.. డేగ కళ్లు మాత్రమే కనిపెట్టగలవు.. మరి మీరూ..!

Viral Video: ఐడియా అదిరందయ్యా చంద్రం.. కొత్త పెళ్లి కొడుకు కొత్త జోష్.. వీడియో చూస్త అవాక్కవుతారు..!

Solar Eclipse 2022: ఈ సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?.. కీలక వివరాలు మీకోసం..