మనమందరం చిన్నప్పుడు ఓ కథ చదువుకొన్నాం. అడవి మృగాల దగ్గర చిక్కుకున్నప్పుడు చనిపోయినట్టు యాక్ట్ చేస్తే..అవి టచ్ చేయకుండా అక్కడినుంచి వెళ్లిపోతాయి. ఇలాంటి సీన్స్ మూవీస్‌లో కూడా చాలా చూశాం. కానీ అదే ట్రిక్ ఓ గుర్రం నిజంగా ప్లే చేస్తుందంటే మీరు నమ్మతారా?..
ఇప్పుడు మీకు ఆ ఇంటిలిజెంట్ గుర్రాన్ని పరిచయం చేయబోతున్నాం. పని చేయడం భారంగా భావించిన ఓ గుర్రం అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంది. జింగాంగ్ అనే ఓ గుర్రం తనతో రైడ్ చేసేందుకు ఎవరు వచ్చినా హఠాత్తుగా కింద పడి చనిపోయినట్లు యాక్ట్ చేస్తోంది. చనిపోయినట్టంటే..మాములుగా కూడా కాదు..ఉన్నపలంగా కిందపడిపోయి, నోట్లో నుంచి నాలుక బయటకు పెట్టి, కండ్లు తేలేసి తన నటనా ప్రతభను చూయిస్తుంది. జింగాంగ్ నటన ఆస్కార్ అవార్డు గెలుచుకునే స్థాయిలో ఉందని నెటిజన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. క్రిట్టర్ క్లబ్ ఫేస్‌బుక్‌లో పేజీలో ఫ్రాసిస్కో జలాసర్ అనే ఆటగాడు షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఈ గుర్రం తీరు చూసి నోరు వెళ్లబెట్టకుండా ఎవరుంటారు చెప్పండి.