Watch: గెలిచేదాకా ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుందని నిరూపించిన శునకం..! తప్పక చూడాల్సిన వీడియో..

|

May 11, 2023 | 12:29 PM

ఎన్నిసార్లు విఫలమైనా పట్టు వదలని ప్రయత్నం చివరకు ఫలించింది అంటూ నెటిజన్లు ప్రశంసించారు. అంకితభావంతో చేసిన కుక్క ప్రయత్నం చూసి చాలా మంది ప్రజలు స్ఫూర్తి పొందుతున్నారు. మీరు ప్రయత్నించకపోతే, మీరు గెలిచినా ఓడినా మీకు ఎలా తెలుస్తుందంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Watch: గెలిచేదాకా ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుందని నిరూపించిన శునకం..! తప్పక చూడాల్సిన వీడియో..
Motivational Video Of Dog
Follow us on

జీవితంలో అవసరమైన అభిరుచి, ధైర్యం కొన్నిసార్లు తగ్గుతాయి. మన సొంత ఆలోచనలు తగ్గిపోతే, మనలోని శక్తి, సామర్థ్యాలు కూడా తగ్గిపోతాయి. మనం ఎక్కువగా ఆలోచించి, తక్కువ చేసినప్పుడు మనం ఊహాలోకంలో పరిగెత్తడం లాంటివి జరుగుతాయి. సాధారణంగా.. మనం కష్టపడి పైకొచ్చిన వాళ్లను చాలా మందినే చూసుంటాం. అలాంటి తమ జీవితంలో ఎన్నో ఒడిదుడుకలును ఎదుర్కోంటారు. పడిలేచే కెరాటాల మాదిరిగా అనేక అటుపోట్లను కూడా భరిస్తారు. కానీ, ఎట్టకేలకు వారి కృషితో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో Dog వైరల్‌గా మారింది. ఆ కుక్క పట్టుదల సాధించిన విజయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక కుక్క తన ముందున్న ఒక పెద్ద డోడను ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. దానికోసం కొంతదూరం వెనక్కి పరిగెత్తి వేగంగా ముందుకు దూసుకొచ్చి గోడను ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, దాని వల్ల కాలేదు. పాపం కింద పడిపోతుంది. మరో ప్రయత్నించింది. కానీ, విఫలమైంది. మళ్లీ ట్రై చేసింది. మళ్లీ ఫెయిల్‌ అయింది. ఈ సారి గట్టిగా ట్రై చేసింది. కానీ, ప్రయత్నం వెస్ట్‌ అయిపోయింది. అలా ఒకటికి నాలుగు సార్లు పదే పదే ప్రయత్నిస్తూనే ఉంది..ఎన్నోసార్లు విఫలమైనా పట్టు వదలకుండా ప్రయత్నించింది. ప్రయత్నించే వారికి ఓటమి తప్పదని అంటారు. సరిగ్గా ఈ కుక్క విషయంలోనూ అదే జరిగింది.

ఇవి కూడా చదవండి

ఎన్నో మార్లు ప్రయత్నించిన తర్వాత ఎట్టకేలకు ఆ శునకం అనుకున్న లక్ష్యాన్ని చేరింది. అనేక ప్రయత్నాల తర్వాత చివరకు ఆ ఎత్తైన గోడను ఎక్కేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకు 14 లక్షలకు పైగా వ్యూస్‌, లక్షల కొద్దీ కామెంట్లను సంపాదించింది. ఎన్నిసార్లు విఫలమైనా పట్టు వదలని ప్రయత్నం చివరకు ఫలించింది అంటూ నెటిజన్లు ప్రశంసించారు. అంకితభావంతో చేసిన కుక్క ప్రయత్నం చూసి చాలా మంది ప్రజలు స్ఫూర్తి పొందుతున్నారు. మీరు ప్రయత్నించకపోతే, మీరు గెలిచినా ఓడినా మీకు ఎలా తెలుస్తుందంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసైన కొందరు విద్యార్థులు, పెద్దవాళ్లు నేర్చుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే.. చిన్న చిన్న ఫెయిల్యూర్ కే మనస్తాపానికి గురికావటం, ప్రాణాలు తీసుకోవటం వంటివి పిచ్చి పనులుగా చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..