సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు కోకొల్లలు. ఎప్పుడూ ఏదొకటి నెటిజన్లకు సవాల్ విసురుతూనే ఉంటుంది. అయితే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోల విషయానికొస్తే మాత్రం కథ వేరుంటుంది. ఇవి మన కళ్లను మభ్యపెడుతుంటాయి. అక్కడ కనిపించేది ఒకటయితే.. యాక్చువల్‌గా లోపల ఉండే మరొకటి. ఆప్టికల్ ఇల్యూషన్స్(Optical Illusion) మన కళ్లకు పదునుపెడుతుంటాయి. అందుకే వీటిని సాల్వ్ చేయడానికి వీక్షకులు ఆసక్తిని చూపిస్తుంటారు. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని సాల్వ్ చేయడానికి నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
పైన పేర్కొన్న ఫోటోలో ఉన్న ఏనుగుకు అసలెన్ని కాళ్లు ఉన్నాయి. మీరు ఫోటోను నిశితంగా పరిశీలించినా.. దీనికి ఆన్సర్ చెప్పలేరు.. ఎందుకంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను సాల్వ్ చేయడం అసాధ్యం. మీ కళ్లను మభ్యపెట్టేస్తుంది. కొంతమంది ఈ ఏనుగు 4 కాళ్లపై నడుస్తుందని చెబుతుంటే.. మరికొందరు 5 కాళ్లు ఉన్నాయని జవాబిస్తున్నారు. మరి మీరేం అంటారు.! ఒక్కసారి ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌పై లుక్కేయండి.. సమాధానం కోసం ట్రై చేయండి..
How Many Legs For Elephant@WhatsTrending @TrendingWeibo @the_viralvideos @itsgoneviraI #Trending #Viral pic.twitter.com/5KoQISJyOh
— telugufunworld (@telugufunworld) April 5, 2022
ది ఇంపాజిబుల్ ఎలిఫెంట్ ఆప్టికల్ ఇల్యూషన్:
“L’egs-istential Quandary” అని పిలువబడే ఈ ఇంపాజిబుల్ ఆప్టికల్ ఇల్యూషన్, సైకాలజిస్ట్ రోజర్ షెపర్డ్ 1990వ సంవత్సరంలో రాసిన ‘మైండ్ సైట్స్’ అనే పుస్తకంలో మొదటిసారి కనిపించింది. ఈ పుస్తకం అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో క్లాసిక్ ఆప్టికల్ ఇల్యూషన్స్ చాలానే ఉన్నాయి.