అరెయ్ ఎంట్రా ఇది.. ఈ రెస్టారెంట్‌లో తినడానికి బుక్ చేసుకుంటే.. నాలుగేళ్లు ఆగాల్సిందే..

|

Jul 27, 2023 | 4:41 PM

సాధారణంగా చాలామంది బయట భోజనం చేసేందుకని రెస్టారెంట్‌కు వెళ్తుంటారు. కొన్ని రెస్టారెంట్లో ఎప్పుడంటో అప్పుడు కూర్చేనేందుకు చోటు దొరుకుంతుంది. మరికొన్ని మంచి రెస్టారెంట్‌లో అయితే ఒకటి లేదా రెండు రోజుల ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది.

అరెయ్ ఎంట్రా ఇది.. ఈ రెస్టారెంట్‌లో తినడానికి బుక్ చేసుకుంటే.. నాలుగేళ్లు ఆగాల్సిందే..
Pub
Follow us on

సాధారణంగా చాలామంది బయట భోజనం చేసేందుకని రెస్టారెంట్‌కు వెళ్తుంటారు. కొన్ని రెస్టారెంట్లో ఎప్పుడంటో అప్పుడు కూర్చేనేందుకు చోటు దొరుకుంతుంది. మరికొన్ని మంచి రెస్టారెంట్‌లో అయితే ఒకటి లేదా రెండు రోజుల ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ యూకేలోని ఓ చిన్న పబ్ గురించి తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే. అక్కడ ఆదివారం మాత్రం టేబుల్ బుక్ చేసుకోవడం అంత సులువు కాదు. వివరాల్లోకి వెళ్తే యూకేలోని బ్రిస్టల్‌లో ఉన్న  ది బ్యాంక్ టావెర్న్ అనే చిన్న పబ్ ఉంది. ఇక్కడ ఆదివారం రోజున భోజనాన్ని బుక్ చేసుకోని ఆస్వాదించడమంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేసే సండే రోస్ట్‌ల కోసం నాలుగు సంవత్సరాల పాటు వేచి చూడాల్సిందే.

అక్కడి రెస్టారెంట్ బుకింగ్ నిపుణులు యూకేలోనే సుధీర్ఘ వెయిటింగ్ లిస్టు ఉన్న పబ్‌గా దీన్ని గుర్తించారు. అయితే కరోనా సమయంలో దేశవ్యాప్తంగా చాలా వరకు పబ్‌లు, రెస్టారెంట్‌లు మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఈ పబ్‌లో సండే రోస్ట్‌ల కోసం జరిగినటువంటి ముందస్తు బుకింగ్స్ వెయిటింగ్ లిస్ట్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు బుక్ చేసుకునేవాళ్లు సండే రోస్టులు ఆస్వాదించాలంటే నాలుగేళ్ల వరకు ఆగాల్సిందే. ఈ రోస్టుల్లో ప్రత్యేకమైన వంటకాలు వడ్డిస్తారు. 2018లోనే బ్రిస్టల్ గుడ్‌ఫుడ్ అవార్డ్స్‌తో ఉత్తమ సండే లంచ్‌గా ఇది ఎంపికైంది. 2019లో ఈ చిన్న పబ్ అబ్జర్వర్ ఫుడ్ మంత్లీ అనే అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది.