ఈ మధ్య పెళ్లిళ్ల సమయంలో అనుకోకుండా జరిగే రకరకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నిజంగా జరిగినవి కాగా, మరికొన్ని మాత్రం కావాలని చేసేవి. అయితేనేం.. నెటిజన్లకు అయితే ఓ రేంజ్ వినోదాన్ని అందిస్తున్నాయి సదరు వీడియోలు. తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సర్కులేట్ అవుతుంది. మాజీ ప్రియురాలికి పెళ్లి అయితే ఎవరైనా అటు వైపు వెళ్తారా.. కానీ ఓ వ్యక్తి వెళ్లాడు. వెళ్లడం మాత్రమే కాదు.. స్టేజ్ కూడా ఎక్కాడు. అనంతరం ఏం చేశాడో దిగవ వీడియోలో మీరే చూడండి.
మాజీ గర్ల్‌ఫ్రెండ్ పెళ్లికి హాజరైన యువకుడు.. స్టేజ్‌పై స్వీట్ తినిపించి ఆమె నోరు తీపి చేసే ప్రయత్నం చేశాడు. కాస్త ఎమోషనల్ కూడా అయ్యాయి. అయితే పెళ్లి కూతురు మాత్రం అతడిని ఎంకరేజ్ చెయ్యలేదు. దీంతో వెంటనే స్టేజ్ దిగి వెళ్లిపోయాడు. చాలా బాలీవుడ్ సినిమా సన్నివేశాలను ఈ ఇన్సిడెంట్ గుర్తు చేస్తుంది. అయితే ఇది నిజంగా జరిగింది కాదని, కేవలం ఫన్ కోసం చిత్రీకరించినట్లు అక్కడ ఉన్నవారి హావభావాలను చూస్తుంటే అర్థమవుతుంది.
Also Read: పోలీస్ కుటుంబాలనూ వదలని సైబర్ కంత్రీగాళ్లు.. తాజాగా సీఐ భార్యను ఎలా మాయ చేశారంటే