ఔరా.. ఈ బుడత ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

| Edited By:

Jul 26, 2019 | 2:26 PM

చైనాలో ఉన్న గ్లాస్‌ బ్రిడ్జిల గురించి వినే ఉంటారు. వాటిలో దక్షిణ చైనాలో ఉన్న జాంగ్‌జియాజీ(ఇప్పుడు యున్‌టియాండ్‌గా పిలుస్తారు)ఒకటి. 869 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్లాస్‌ బ్రిడ్జి మీద నడవడమంటే కత్తి మీద సాము వంటిదే. నడవడం మాట అటుంచితే.. అక్కడ నుంచొని కిందికి చూడటానికి కూడా కొందరు భయపడుతుంటారు. ఎందుకంటే గ్లాస్ చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ.. అది విరిగి ఎక్కడ కిందపడిపోతామేనన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇక ఈ బ్రిడ్జి మీద నడిచేందుకు […]

ఔరా.. ఈ బుడత ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే
Follow us on

చైనాలో ఉన్న గ్లాస్‌ బ్రిడ్జిల గురించి వినే ఉంటారు. వాటిలో దక్షిణ చైనాలో ఉన్న జాంగ్‌జియాజీ(ఇప్పుడు యున్‌టియాండ్‌గా పిలుస్తారు)ఒకటి. 869 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్లాస్‌ బ్రిడ్జి మీద నడవడమంటే కత్తి మీద సాము వంటిదే. నడవడం మాట అటుంచితే.. అక్కడ నుంచొని కిందికి చూడటానికి కూడా కొందరు భయపడుతుంటారు. ఎందుకంటే గ్లాస్ చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ.. అది విరిగి ఎక్కడ కిందపడిపోతామేనన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇక ఈ బ్రిడ్జి మీద నడిచేందుకు భయపడ్డ ఎంతోమంది వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో మనం చూడొచ్చు. అలాంటిది మూడేళ్లున్న ఓ బుడత ఎవ్వరి సహాయం లేకుండా ఆ బ్రిడ్జి మీద నడిచింది. తనకు ఇష్టమైన మంకీ బ్యాక్‌ప్యాక్.. పాండాను కలిగిన ఉన్న హ్యాట్‌ను పెట్టుకున్న ఆ చిన్నది.. మొదటి అడుగు వేయడానికి కాస్త సందేహించినప్పటికీ.. ఆ తరువాత ఎలాంటి భయం లేకుండా, ఎక్కడా ఆగకుండా నడుచుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ బుడత తల్లి మే 20న సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్త వైరల్‌గా మారింది. దీన్ని నెటిజన్లు ఆ పిల్ల ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ‘‘బుడత నువ్వు అసాధ్యురాలివే’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.