Viral Video: గ్లాస్‌లో నీళ్లు తాగుతున్న బ్లాక్ కోబ్రా.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..

|

May 19, 2022 | 8:05 AM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో చాలా వరకు జంతువులకు సంబంధించినవే.. వన్యప్రాణులకు సంబంధించిన వివిధ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: గ్లాస్‌లో నీళ్లు తాగుతున్న బ్లాక్ కోబ్రా.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
Black Cobra
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో చాలా వరకు జంతువులకు సంబంధించినవే.. వన్యప్రాణులకు సంబంధించిన వివిధ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతువులను వేటాడడం, ఒక దానిపై మరొకటి దాడి చేసుకోవడం, ఓక్ దానికొకటి సహాయం చేసుకోవడం వంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జంతువుల ఆసక్తికరమైన వీడియోలకు చాలా మంది అభిమానులున్నారు ఉన్నారు. మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పాముల్ని చూస్తూనే మనం భయపడి పరుగుపెడతాం.. కొంతమంది మాత్రం ఏమాత్రం భయం లేకుండా వాటిని పట్టుకుంటారు. వాటితో ఆటలాడుతూ ఉంటారు. ఈ వీడియోలో దాహంతో ఉన్న పాముకు ఓ వ్యక్తి నీళ్లు తాగించాడు. అయితే అది చిన్న పాము కాదు. భయంకరమైన నల్ల త్రాచు. అది కాటు వేస్తే మనుషులు క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలాంటి భయంకరమైన పాముకు ఈ వీడియాలో ఓ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా గ్లాస్ తో నీళ్లు తాగించాడు.

ఇవి కూడా చదవండి

IFS ఉద్యోగి సుశాంత్ నందా చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. ఈ వీడియోతోపాటు..బాతులు కోతి పిల్లతో పుచ్చకాయను పంచుకున్న వీడియో కూడా షేర్ చేశాడు. ఈ రెండు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie: ఊపేసిన అనిల్‌ రావిపూడి.. పార్టీ సాంగ్‌తో తనదైన స్టెప్పులతో..

Major Movie: మేజర్‌ సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న ‘ఓ ఇషా’ రొమాంటిక్‌ సాంగ్‌..

Deepika Pilli: ట్రెండీ వేర్ లో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్న దీపికా పిల్లి లేటెస్ట్ పిక్స్