అమ్మాయి లోదుస్తులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు.. వింత దొంగతనం కేసు.. వైరల్ వీడియో.!

|

Mar 19, 2021 | 7:46 AM

Strange Theft Case: ఈ రోజు వరకు, మీరు దొంగతనాలకు సంబంధించి అనేక వింత కేసుల గురించి చదివి ఉంటారు. అలాగే తరచుగా దొంగలు విలువైన...

అమ్మాయి లోదుస్తులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు.. వింత దొంగతనం కేసు.. వైరల్ వీడియో.!
Follow us on

Strange Theft Case: ఈ రోజు వరకు, మీరు దొంగతనాలకు సంబంధించి అనేక వింత కేసుల గురించి చదివి ఉంటారు. అలాగే తరచుగా దొంగలు విలువైన వస్తువులతో పరార్ అయినట్లు పలు కేసుల గురించి విని ఉంటాం. అయితే మహిళల లోదుస్తులను దొంగిలించే దొంగను మీరు ఎప్పుడైనా చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి వింత కేసు ఒకదాని గురించి ఉత్తరప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. బహుశా.! ఇది విని దొంగలు సైతం ఒక్క క్షణం షాక్ అయి ఉంటారు.

ఈ వింత కేసు ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో స్కూటీపై ఓ ఇద్దరు యువకులు అమ్మాయి లోదుస్తులను దొంగిలించి పారిపోతున్నట్లు చూడవచ్చు. ఇదే వింత అనుకుంటే.. అక్కడ స్థానికంగా నివసిస్తున్న ప్రజలు ఇలాంటి సంఘటన గతంలోనూ జరిగిందని చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురు లోదుస్తులను దొంగలించి.. ఏవైనా తాంత్రిక పూజలు నిర్వహిస్తారేమోనని సదరు బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై, ఎ.ఎస్.పి సూరజ్ రాయ్ మాట్లాడుతూ బాలికల బట్టలు దొంగిలించే ఈ ప్రత్యేకమైన కేసుపై దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఓ యువకుడిని అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నాం.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!