నదిలో కొట్టుకువస్తున్న బంగారం..! జల్లెడ పడుతున్న స్థానికులు..ఎక్కడో కాదండోయ్‌..!!

|

Oct 27, 2024 | 7:40 AM

అక్కడి నదులు ప్రవాహించే బండలు, రాళ్లు మధ్యలో బంగారం దొరుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో బంగారు గనులు నది కోతకు గురి కావటం వల్ల బంగారు రేణువులు నది నీటిలో కలుస్తాయి. ప్రవాహంలో అవి చాలా దూరం వరకు కొట్టుకుని పోతుంటాయి. వాటినే ప్రజలు వలలు, జల్లెడ వేసి పట్టుకుంటుంటారు. అలాంటి కొన్ని నదుల గురించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

నదిలో కొట్టుకువస్తున్న బంగారం..! జల్లెడ పడుతున్న స్థానికులు..ఎక్కడో కాదండోయ్‌..!!
There Are Rivers Of Gold
Follow us on

ప్రపంచంలో చాలా నదులలో బంగారం దొరుకుతుంది. ప్రజలు ఆ బంగారాన్ని దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు.. నదీ జలాలలను జల్లెడ పడుతుంటారు. అలాంటి ప్రాంతాల్లో అక్కడి నదులు ప్రవాహించే బండలు, రాళ్లు మధ్యలో బంగారం దొరుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో బంగారు గనులు నది కోతకు గురి కావటం వల్ల బంగారు రేణువులు నది నీటిలో కలుస్తాయి. ప్రవాహంలో అవి చాలా దూరం వరకు కొట్టుకుని పోతుంటాయి. వాటినే ప్రజలు వలలు, జల్లెల్లు వేసి పట్టుకుంటుంటారు. అలాంటి కొన్ని నదుల గురించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

మిస్సోరి నది :

యునైటెడ్ స్టేట్స్ లోని మిస్సోరి నది ఇసుకలో బంగారం కోసం ప్రజలు గాలిస్తుంటారు. 19వ శతాబ్దం మధ్యకాలం నుండి మిస్సోరి నది ప్రవాహంలో బంగారం కోసం జనాలు గాలింపు సాగిస్తున్నారు. ఇక్కడ లభించే బంగారు రేణువులు సేకరిస్తూ, వాటిని అమ్ముకుంటూ స్థానికులు జీవనం సాగిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

కిలోడైక్ నది: 

కెనడాలోని కిలోడైక్ నది కూడా బంగారు లోహాలకు నిలయంగా చెబుతుంటారు.. ఈ నదిలో, దాని చుట్టు పక్కల తవ్వకాలు జరపడంవల్ల బంగారం లభిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ లభించే బంగారం సేకరణ ద్వారానే ఇక్కడ చాలా మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు.

స్వర్ణరేఖ నది:

భారతదేశంలోని జార్ఖండ్‌లోని స్వర్ణరేఖ నదిలో కూడా ప్రవహిస్తుంది. ఇక్కడి నది ప్రవాహంలో చాలా చోట్ల బంగారు కణాలు కనిపిస్తాయి. స్థానికులు బంగారు రేణువులను సేకరిస్తారు. స్వర్ణరేఖ నదిని స్థానిక ప్రజలు సోన్ నది అని కూడా పిలుస్తారు. ఇది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహిస్తుంది. కర్కారీ నది స్వర్ణరేఖ నదికి ఉపనది. దీనిలో కూడా బంగారం ప్రవహిస్తుంది.

బిగ్ హాల్ నది: 
బిగ్ హాల్ నది యునైటెడ్ స్టేట్స్‌లోని మోంటానాలో ఉంది. నేటికీ ఈ నదిలో బంగారం పెద్ద మొత్తంలో లభిస్తుంటుంది.  ఇక్కడి నుంచి ఇప్పటివరకు రూ.37 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని వెలికితీశారు.

యుబా నది:

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ముబా నదిలో కూడా బంగారు రేణువులు కనిపిస్తాయి. దాని ఉపనదుల్లో కూడా బంగారు రేణువులు ప్రవహిస్తాయి. ప్రజలు దాని నుండి బంగారాన్ని సేకరిస్తూ విక్రయిస్తుంటారు.

రైన్ నది, యూరప్:

ఐరోపాలోని రైన్ నదిలో కొన్ని ప్రదేశాలలో బంగారు రేణువులు కనిపిస్తాయి. పురాతన కాలంలో, జర్మనీ, స్విట్జర్లాండ్ ప్రజలు ఈ నది ఒడ్డున బంగారం కోసం వెతకేవారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..