Three robbers loot in shop: దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు తుపాకీలతో షాపులోకి ప్రవేశించిన దొంగలు.. యజమానిని బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ షాకింగ్ సంఘటన ఢిల్లీలోని ఖేరా ఖుర్ద్ హౌస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఖేరా ఖుర్ద్ హౌస్ ప్రాంతంలో ఓ హర్డ్‌వేర్ దుకాణంలోకి శనివారం ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి తుపాకీలతో దూసుకొచ్చారు. ఇద్దరు హెల్మెట్లను ధరించి రాగా.. మరొకరు ముఖానికి వస్త్రాన్ని కప్పుకొని కనిపించాడు. ఈ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక దుకాణ యజమాని బిక్కుబిక్కుమంటూ నిల్చుండిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులు దుకాణంలోకి ప్రవేశించగానే.. అక్కడ ఉన్న ఓ వ్యక్తిని పక్కకు నెట్టారు. అనంతరం నగదు కౌంటర్ వద్ద ఉన్న యజమానికి గన్ షాట్ పెట్టి పక్కకు నెట్టారు. అనంతరం కౌంటర్ తెరచి నగదు తీసుకున్నారు. ఈ దోపిడీ అక్కడున్న మొత్తం సీసీ ఫుటేజీలో కనిపించింది. ఈ వీడియోను ఆదివారం పోలీసులు విడుదల చేశారు.
వీడియో..
#WATCH | Two unknown miscreants looted a hardware shop at gunpoint in Delhi’s Khera Khurd area, yesterday pic.twitter.com/DI8Izx5Ky1
— ANI (@ANI) September 5, 2021
Also Read: