ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫా పేరుగాంచింది. దుబాయ్‌లో ఉన్న ఈ భవనం ఎత్తు ఏకంగా 829.8 మీటర్లు. అంటే 2,722 అడుగులు. ఈ భవనంపైకి ఎక్కి ఓ యువకుడు చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్ అవుతోంది. మిస్టర్ బీస్ట్ అని పిలవబడే యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్ సన్ చేసిన సాహనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు.. షాక్ అయ్యేలా చేస్తోంది. ఈ వీడియో చూస్తే అతడు సాహసం చేయడంలో మరో స్థాయికి చేరాడని చెప్పుకోవాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా. మిస్టర్ బీస్ట్ ఈ భవనం చివరి అంచు వరకు వెళ్లాడు. జిమ్మీ డొనాల్డ్ సన్ తాను బుర్జ్ ఖలీఫా అధిరోహించిన క్షణాలను వీడియో తీసుకున్నాడు.. దాన్ని అతడు సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 17 నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రతి ఒక్కరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. 49 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. లక్షల మంది దీనికి కామెంట్లు చేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వీడియోలో బుర్జ్ ఖలీఫాపై అడుగు పెట్టిన ఆ క్షణంలో తను పొందిన అనుభవాన్ని వీడియోలో వివరించాడు..“నేను సాధించాను. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపై నేను నిలబడి ఉన్నాను.. అంటూ చెప్పుకొచ్చాడు.. ఇది చాలా భయంకరంగా ఉంది. నేను కిందికి చూడకూడదు, చూస్తే భయానకంగా అనిపిస్తోంది” అంటూ టెన్షన్ పడుతూ చెప్పాడు. అతను చేసిన స్టంట్ చూసిన నెటిజన్లు సైతం రోమాలు నిక్కపొడుచుకున్నాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బాబోయ్ అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేశారు. మిస్టర్ బీస్ట్ చరిత్ర సృష్టించాడు, వీడియోల కోసం మరీ ఇంతకు తెగించాలా” అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..