Rice Water: బియ్యం కడిగిన నీళ్లు పారబోసేస్తున్నారా..? ఇలా జుట్టుకు వాడి చూడండి..మార్పు ఫిదా అవుతారు..

చాలామంది తమ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం సహజ పద్ధతులు, ఇంటి చిట్కాలపై ఆధారపడుతుంటారు. ఇందుకోసం ఇంట్లో లభించే సహజ పదార్ధాలనే ఉపయోగిస్తుంటారు. వీటిలో బియ్యం నీరు కూడా ముఖ్యమైనది. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బియ్యం కడిగిన నీరు జుట్టుకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Nov 03, 2024 | 9:32 PM

వెంట్రుకల అందాన్ని పెంచడంలో బియ్యం కడిగిన నీరు కీలక పాత్ర పోషిస్తుంది. బియ్యంలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇనోసిటోల్‌ అనే ఒక కార్బోహైడ్రేట్‌ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ కార్పొహైడ్రేట్‌ సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జుట్టును బియ్యం  కడిగిన నీళ్లతో వాష్‌ చేసుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
నల్లగా మెరుస్తూ మృదువుగా మారుతుంది.

వెంట్రుకల అందాన్ని పెంచడంలో బియ్యం కడిగిన నీరు కీలక పాత్ర పోషిస్తుంది. బియ్యంలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇనోసిటోల్‌ అనే ఒక కార్బోహైడ్రేట్‌ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ కార్పొహైడ్రేట్‌ సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జుట్టును బియ్యం కడిగిన నీళ్లతో వాష్‌ చేసుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నల్లగా మెరుస్తూ మృదువుగా మారుతుంది.

1 / 6
బియ్యం కడిగిన నీరు మీ జుట్టు మూలాల్లో సరైన విటమిన్ల లోపాన్ని పూరిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లతో తలస్నానం చేయటం వల్ల చుండ్రు పోతుంది. తలపై ఉండే చిన్న చిన్న పొక్కులు వంటివి కూడా తగ్గిపోతాయి. జుట్టు నిగనిగలాడుతుంది.

2 / 6
జుట్టు పెరుగుదలలో బియ్యం నీరు పరోక్ష పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టుకు అదనపు మెరుపును అందిస్తుంది. కాబట్టి, మీరు మీ హెయిర్‌కేర్‌ రోటీన్‌లో కూడా ఈ బియ్యం కడిగిన నీటిని ఉపయోగించవచ్చు. కావాలంటే, మీరు రైస్ వాటర్ హెయిర్ స్ప్రేని కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది మీ జుట్టు మీద రక్షణ పొరను ఏర్పరుస్తుంది. కాబట్టి ఎటువంటి హానికరమైన పదార్థాలు మీ జుట్టును నేరుగా ప్రభావితం చేయవు.

3 / 6
అలాగే, హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో అవిసె గింజల పొడి, బియ్యం పిండిని కలపండి. ఇందులో కొన్ని చెంచాల బియ్యం నీటిని కలపాలి. చిక్కటి మిశ్రమం తయారు చేసుకుని, జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. దీంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు.

4 / 6
జుట్టును వాష్‌ చేయడానికి ఉపయోగించడం వల్ల కూడా ప్రభావం ఉంటుంది. ఇది మీ జుట్టు అందాన్ని కాపాడుకోవడానికి ఒక్క బియ్యం నీరే వందపాళ్లు ఉపయోగపడుతుంది. కాబట్టి, బియ్యం కడిగిన నీటిని జుట్టు మూలాల్లోకి పట్టించి స్మూత్‌గా మసాజ్ చేయండి. ఇది మీ జుట్టును అందంగా, మెరిసేలా చేస్తుంది.

5 / 6
కానీ, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. మీకు మీ జుట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా, అందుకు చికిత్స తీసుకుంటున్నా ఇలాంటివి పాటించే ముందు వైద్యులను సంప్రదించటం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

6 / 6
Follow us
రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చడుగా

ఎట్టకేలకు స్టార్ హీరో నుంచి జానికి పిలుపు..

ముంబైలో అనేక సినిమా షూటింగ్స్ జరుపుకున్న పోర్ట్స్ పై ఓలుక్ వేయండి

వాకింగ్ కోసం వచ్చిన వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

బిగ్ బాస్ స్టేజ్ పై స్టార్ హీరోను ఇమిటేట్ చేసిన ప్రియమణి..

తండ్రి అంత్యక్రియలు చేస్తుంటే కనిపించని కొడుకు.. ఆరా తీయగా..

కలలో నలుపు, తెలుపు పాము కనిపిస్తే ఎటువంటి సంకేతాలు అంటే

శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య - శోభిత

ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కమెడియన్

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా ప్రొడ్యూసర్ దిల్ రాజు..