Viral Video: అరెరే.. ఇదేంటయ్య పుష్పరాజ్.. శ్రీవల్లి పాటను ఇలా చేశావ్..

|

Feb 02, 2022 | 12:00 PM

చూపే బంగారమయెనా శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే.. ఇప్పుడు ఎక్కడా విన్నా ఇదే సాంగ్.. చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్

Viral Video: అరెరే.. ఇదేంటయ్య పుష్పరాజ్.. శ్రీవల్లి పాటను ఇలా చేశావ్..
Srivalli Song
Follow us on

చూపే బంగారమయెనా శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే.. ఇప్పుడు ఎక్కడా విన్నా ఇదే సాంగ్.. చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. సిద్ శ్రీరామ్ (Sid Sriram) ఆలపించాడు. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన పుష్ప (Pushpa) సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయగా.. సోషల్ మీడియాలో ఈ మూవీ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. పుష్ప పాటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్.. లుక్.. స్టైల్.. పుష్పరాజ్ మేనరిజం ఆడియన్స్‏ను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో పుష్ప పాటలకు..డైలాగ్స్‏ను తమ స్టైల్లో ఫాలో అవుతూ రచ్చ చేస్తున్నారు నెటిజన్స్.

బన్నీ.. రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమా గతేడాది డిసెంబర్ నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటల క్రేజ్ ఏ రేంజ్‏లో ఉందో తెలిసిందే. అయితే ఎంతో అందంగా సాగే శ్రీవల్లి పాటను జానపదంగా పాడితే ఎలా ఉంటుందో విన్నారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కాశ్మీరికి చెందిన ఫోక్ సింగర్ శ్రీవల్లి పాటను తనస్టైల్లో పాడారు. హార్మోనియం వాయిస్తూ శ్రీవల్లి పాటను అందంగా జానపదం గొంతుతో ఆలపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Kiran Abbavaram: నా సినిమా విడుదల రోజు కూడా ఆస్టార్ హీరో సినిమాకే వెళ్తాను.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

Radhe Shyam: ప్రభాస్‌తో పోటీకి సై అంటున్న తమిళ్ స్టార్ హీరో.. రాధేశ్యామ్ సినిమాకు పోటీగా సూర్య సినిమా..?

Venkatesh Daggubati and Rana: తండ్రి కొడుకులుగా వెంకటేష్ , రానా.. ఆ మలయాళ సినిమా రీమేక్ లో దగ్గుబాటి హీరోలు