కారుతో ‘ కయ్యం ‘…కుమ్మేసిన ఖడ్గమృగం

కారుతో ' కయ్యం '...కుమ్మేసిన ఖడ్గమృగం

జర్మనీలోని సెరెంగెటి పార్క్ లో ఉన్నట్టుండి ఓ ఖడ్గ మృగం రెచ్చిపోయింది. రోజూ తనకు ఆహారం పెట్టడానికి వచ్ఛే కీపర్ కారుపైనే లంఘించింది. ఆ కీపర్ కారులో ఉండగానే ఆ వాహనాన్ని తన కొమ్ముతో తోసివేస్తూ నానా హంగామా చేసింది. ఎప్పుడూ శాంతంగా ఉండే హుసిని అనే ఈ రైనో చేసిన ‘ దాడి ‘ తో భయపడిన ఆ కీపర్ వాహనం నుంచి ఎలాగో బయటపడి తన ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే రైనో మాత్రం కసి […]

Pardhasaradhi Peri

| Edited By: Anil kumar poka

Aug 29, 2019 | 3:01 PM

జర్మనీలోని సెరెంగెటి పార్క్ లో ఉన్నట్టుండి ఓ ఖడ్గ మృగం రెచ్చిపోయింది. రోజూ తనకు ఆహారం పెట్టడానికి వచ్ఛే కీపర్ కారుపైనే లంఘించింది. ఆ కీపర్ కారులో ఉండగానే ఆ వాహనాన్ని తన కొమ్ముతో తోసివేస్తూ నానా హంగామా చేసింది. ఎప్పుడూ శాంతంగా ఉండే హుసిని అనే ఈ రైనో చేసిన ‘ దాడి ‘ తో భయపడిన ఆ కీపర్ వాహనం నుంచి ఎలాగో బయటపడి తన ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే రైనో మాత్రం కసి దీరా ఆ కారును తోసుకుంటూ.. దాన్ని కిందపడేసినంత పని చేస్తూ ‘ బాల్ ‘ లా దాన్ని ‘ ఆడుకుంది ‘. దాని ఆగ్రహంలో ఆ వాహనం దాదాపు నుజ్జు నుజ్జయింది. దాని దూకుడుకు కారణమేమిటో తెలియలేదు. ఆ దారంట వెళ్తున్న విజిటర్ ఒకరు ఈ సీన్ ని తన కెమెరాకు ఎక్కించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu