Terrifying Landslide: ఉత్తర భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో.. మంచు చరియలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ఎంత భయానకంగా ఉంటుందో చెప్పడం వర్ణనాతీతం. ఈ ప్రమాదాల్లో కొంతమంది మరణిస్తుండగా.. మరికొంతమంది గాయాలపాలవుతున్నారు. తాజాగా.. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడే భయానక వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కొండ చరియలు విరిగిపడేటప్పుడు ఎంత భయానకంగా ఉంటుందో.. ఈ వీడియోలు అద్దంపడుతున్నాయి. అయితే.. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొంటున్నారు. కొండచరియలు విరిగిపడటం ప్రారంభమైన క్రమంలో మొదటి వీడియోను అక్కడున్న వారు చిత్రీకరించారు.
వైరల్ వీడియో..
పెద్ద పెద్ద రాళ్లు కొండ ప్రాంతం నుంచి దూసుకువస్తుండటాన్ని వారు చిత్రీకరించారు. అయితే.. అక్కడున్న వారు పారిపోండి.. పారిపోండి.. అంటూ అంటూ కేకలు సైతం వేస్తూ పరుగులు తీస్తున్నారు. దీంతోపాటు స్థానికులు ఈలలు వేస్తూ.. దూరంగా ఉండండి అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ భయానక వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన వారంతా వామ్మో.. కొండ చరియలు ఇలా విరిగిపడతాయా అంటూ భయంతో కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. కొండ, మంచు చరియలు నిత్యం ఎక్కడో ఓ చోట విరిగిపడుతున్నాయి.
Also Read: