
బెంగాల్ తీరంలో లభించే అరుదైన తెలియా భోలా చేపకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. తెలియా భోలా చేప సాధారణంగా సముద్రంలో కనిపిస్తుంది. బంగారు రంగులో కనిపించే ఈ చేప ఖరీదు కూడా బంగారంతో పోటీ పడుతుంది. వీటిని ఘోల్ లేదా బ్లాక్ స్పాటెడ్ క్రోకర్ అని కూడా పిలుస్తారు. ఈ చేపల ధర కేజీ రూ.30,000–35,000 వరకు పలుకుతుంది. 2022లో 55 కిలోల చేప ఏకంగా రూ.13 లక్షలకు అమ్ముడుపోయింది. ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన ఒక మత్స్యకారుడికి ఏకంగా 29 తెలియా భోలా చేపలు ఒకేసారి పడ్డాయి. ఒక్కో చేప 20 కిలోలకు పైగా బరువు ఉందని తెలిసింది.. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకీ ఈ చేప ఖరీదు ఎందుకింత ఎక్కువగా ఉంటుందో ఇక్కడ చూద్దాం…
లోతైన సముద్రంలో లభించే ఈ చేప లక్షల రూపాయల విలువైనది. ఈ చేప కడుపులో ఉండే కొవ్వు నుండి ప్రాణాలను రక్షించే మందులను తయారు చేస్తారు. ఈ చేపలు సంవత్సరానికి 2 లేదా 3 మాత్రమే వలలో పడతాయని మత్స్యకారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు వీటి కోసం భారీ ధరలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ, సంతానోత్పత్తి కాలంలో ఇది తీరప్రాంతాలు, సమీప నదులు మొదలైన వాటిల్లోకి వచ్చి చేరుతుందని అంటున్నారు. ఈ జాతి చేపలు సంవత్సరానికి రెండు నుండి మూడు మాత్రమే దొరుకుతుంటాయని జాలర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ చేపను పట్టే మత్స్యకారులకు ఒకేసారి కాసుల వర్షం కురిపిస్తుందని వ్యాపారులు అంటున్నారు.
తెలియా భోలా చేప పుష్కలమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ చేప శరీర భాగాలను ప్రాణాలను కాపాడే క్యాప్సూల్ కవర్ల తయారీలో ఉపయోగిస్తారు. విదేశీ మార్కెట్లలో ఈ చేపకు భారీ డిమాండ్ ఉంది. ఈ చేప బ్లబ్బర్ (ప్రాధమిక కొవ్వు నిల్వ) జీవాన్ని ఇచ్చే మందుల తయారీలో వాడుతున్నారు.. ఈ కారణంగా, దీనిని చాలా ఖరీదైనదిగా అమ్ముతారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..