Khammam district: బామ్మ రాక్స్.. పెళ్లి కూతురు షాక్.. 80 ఏళ్ల వయస్సులోనూ ఎనర్జీ ఏమాత్రం తగ్గలే

80 ఏళ్ల వయసులో బామ్మ గారు దుమ్మురేపారు. అదిరే స్టెప్పులతో పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరిచారు. వీడియో చూడండి....

Khammam district: బామ్మ రాక్స్.. పెళ్లి కూతురు షాక్.. 80 ఏళ్ల వయస్సులోనూ ఎనర్జీ ఏమాత్రం తగ్గలే
Grandma Dance

Updated on: May 27, 2022 | 4:41 PM

Viral Video: అందమైన మనస్సు ఉండాలి కానీ.. ఏ వయసులోనా లైఫ్‌ని ఆనందమయం చేసుకోవచ్చు. మనతో పాటు తోటి వారికి కూడా ఆనందాల్ని పంచవచ్చు. 60 ఏళ్లు వచ్చాయంటే వారు ఔట్ డేటెడ్ అని ఫిక్సవుతారు చాలామంది. అయితే లేట్ వయస్సులోనూ తాము టాపే అని చెబుతుంటారు చాలామంది. తాజాగా 80 ఏళ్లు వయస్సులో కూడా తనకు ఏ రేంజ్ ఎనర్జీ ఉందో డ్యాన్స్ ద్వారా చూపించారు ఓ బామ్మ. పెళ్లి వేడుకలో 80 సంవత్సరాల బామ్మ హుషారుగా వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.పెళ్లి కూతురు పక్కనే ఉండగా..పెళ్లి కొడుకుతో కలిసి బామ్మ స్టేజిపై  సూపర్ స్టెప్స్ వేసింది. డీజే టిల్లు టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే మూమెంట్స్ వేసింది. తెలంగాణ(Telangana)లోని ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి(pandillapalli) గ్రామంలో జరిగిన బందువుల పెళ్లి వేడుకలో బామ్మగారు ఇలా స్టెప్పులు వేశారు. బామ్మ హుషారు చూసి..అక్కడున్న వారు..వారెవ్వా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రజంట్ బామ్మ  డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు అంటూ పట్టుమని 10 నిమిషాలు సరిగ్గా నిలబడలేని యువతీ యువకులు ఈ బామ్మను చూసి కూసింత ఇన్‌స్పైర్ అవ్వండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నారాయణ, టీవీ9 తెలుగు, ఖమ్మం