తండ్రి తెచ్చిన సెకండ్ హ్యాండ్ సైకిల్ చూసి.. సంతోషం తో కొడుకు రియాక్షన్ కి ఫిదా అయిపోయిన నెటిజన్స్
జీవితంలో చిన్న చిన్న ఆనందాలకు కూడా నోచుకోని వారు ఎందరో ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ చిన్నారి బాలుడు తన తండ్రి తెచ్చిన వాహనాన్ని చూసి ఆనందంతో కేరింతలు కొట్టాడు.
జీవితంలో చిన్న చిన్న ఆనందాలకు కూడా నోచుకోని వారు ఎందరో ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ చిన్నారి బాలుడు తన తండ్రి తెచ్చిన వాహనాన్ని చూసి ఆనందంతో కేరింతలు కొట్టాడు. భక్తితో దానికి మొక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతోంది. : వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పేద కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు ఉన్నారు. వారున్న ప్రదేశాన్ని, ఆ ఇంటిని చూస్తుంటే వారు కడు పేదవారని అర్ధమవుతోంది. అయితే ఆ తండ్రి తమ ఇంటికి పాతదో.. కొత్తదో మొత్తానికి ఒక సైకిల్ తెచ్చాడు. అది చూడగానే ఆ చిన్నారి ఆనందంతో కేరింతలు కొట్టాడు. అయితే సాధారణంగా కొత్త వస్తువులు ఏవైనా ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాటికి పూజచేసి వాడుతుంటారు. ఇదిగో ఈ తండ్రి కూడా అదే చేశాడు. ఆ సైకిలుకి చక్కగా పూల దండ వేసాడు. నీటితో అభిషేకం చేశాడు. ఎంతో వినమ్రంగా ఆసైకిలుకి నమస్కరించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

